దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా హడలెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా డేల్టావేరియంట్ కన్నా మరింత రెట్టింపుతో ఒమిక్రాన్ పంజా విసురుతుంది. ఇక భారత్ లో కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇది చదవండి : కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. ఫోటో షేర్ చేసిన భర్త
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ 3.24 శాతంగా ఉంది. ప్రస్తుతం 1,71,830 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 3,43,06,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా భారిన పడి 124 మంది మరణించారు. కొవిడ్ మృతుల సంఖ్య 4,82,017కు చేరింది. ఇప్పటివరకు దేశంలో 1,46,70,18, 464 కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. 766 మంది కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/EppGkq8YnX pic.twitter.com/HtA1aXZZGM
— Ministry of Health (@MoHFW_INDIA) January 4, 2022