తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురించి తెలియని వారు ఉండరు. తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పటికీ దేశ రాజకీయాల్లో ఆయన పేరు ఎప్పుడూ మారుమోగుతుంది.
తమిళనాడు డీఎంకే అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కలేదు. డిఎంకే చీఫ్ ఎం. కరుణానిధి మూడవ కుమారుడు స్టాలిన్. ఆయన తన 14 ఏండ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. మొదటి నుంచి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి గా నిలబడి ఘన విజయం అందుకొని ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. రాజకీయాల్లో ఎన్న ఒడిదుడుకులు వచ్చినా.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తాజాగా స్టాలిన్ తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. అపోలో హాస్పిటల్ లో చేరారు. గత కొంతకాలంగా ఆయన జీర్ణకోశ వ్యాధి తో ఇబ్బంది పడుతున్నారు. తరుచూ ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంటూ ఉన్నారు. తాజాగా క్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రెస్ నోటును విడుదల చేశాయి. ఆయనకు సాధారణ ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించి రేపు మంగళవారం ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు అపోలో వైద్యులు.
రెగ్యూలర్ చెకప్ కోసం ఆయన ఆస్పత్రిలో చేరారని హాస్పిటల్ వర్గం వారు పేర్కొన్నారు. అంతకు ముందే ఆయన ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన రోడ్లు, వంతనెల పనులపై సమీక్షా సమావేవం నిర్వహించారు. కాగా, తమ ప్రియతమ నాయకుడు ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలిసిన తర్వాత కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందారు. ఆయన క్షేమంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.