భర్త నక్సలైట్ల దాడిలో ప్రాణాలు విడిచాడు. ఆ విషయం విని భార్య తట్టుకోలేకపోయింది. ప్రాణంగా ప్రేమించే భర్త లేని లోకంలో తాను ఉండలేనంటూ చితి మీద పడుకుంది. ఆ దృశ్యం చూసి ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు.
స్త్రీకి పెళ్లి అయ్యేంతవరకు తల్లిదండ్రులు ప్రాణం.. కానీ పెళ్లైన నాటి నుంచే భర్తే లోకంగా బతుకుతుంది. అతడి క్షేమమే తన సౌభాగ్యం అనుకుంటుంది. భర్త కోసం ఎన్నో మొక్కులు మొక్కుతుంది.. పూజలు చేస్తుంది. భర్త క్షేమమే ఆమెకు ముఖ్యం. భర్తనే ప్రాణంగా ప్రేమించే మహిళ.. అతడు లేడని తెలిస్తే తట్టుకోగలదా.. లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జవాన్‌గా పనిచేస్తోన్న భర్త.. అమరుడయ్యాడు. అతడి అంత్యక్రియల సందర్భంగా విషాదకర సంఘటన చోటు చోటు చేసుకుంది. చనిపోయిన భర్తతో పాటే తనను కూడా దహనం చేయమని కోరుకుంటూ.. చితి మీద పడుకుంది భార్య. ఈ సంఘటన చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. ఆ వివరాలు..
ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ లే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 10 మంది జవానులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దంతెవాడలో బుధవారం అనగా ఏప్రిల్ 26 నక్సల్స్ జరిపిన ఐఈడీ పేలుడులో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ)కి చెందిన పది మంది భద్రతా సిబ్బంది, వారి వాహనం డ్రైవర్ మరణించారు. చనిపోయిన అధికారులు ఈ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ ఘటనలో చనిపోయిన ఓ జవాన్ దహన సంస్కారాల్లో చోటు చేసుకున్న ఓ దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త మృతిని తట్టుకోలేని మహిళ గుండెలు పగిలేలా రోదించింది. భర్త లేని లోకంలో తాను బతకలేనంటూ తనను కూడా భర్తతో పాటే దహనం చేయాలంటూ చితి మీద పడుకుంది.
కసోలి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అమర జవాన్ భార్య తన భర్త అంత్యక్రియల కోసం అలంకరించిన చితిపై పడుకుని, “నన్ను అతనితో పాటే దహనం చేయండి’’ అంటూ రోదించింది. ‘‘నా భర్త లేని లోకంలో నేను ఉండలేను. నేను జీవించడానికి కారణం లేదు’’ అంటూ భర్త చితిపై పడుకుని లేవలేదు. తన కళ్ల ఎదురుగానే తన భర్త మంటల్లో కాలిపోతుంటే చూడలేకపోతున్నాను అంటూ గుండె పగిలేలా విలపించింది. ఆ దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. బిడ్డను కోల్పోయి తల్లిదండ్రులు.. తండ్రిని కోల్పోయి బిడ్డలు.. భర్తే లోకంగా బతికిన భార్యల రోదనలతో ఆ ప్రాంతం మారు మోగిపోయింది. ఇంతమందిని ఏడిపించే హక్కు ఎవరిచ్చారు అంటూ ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.