సాధారణంగా కానిస్టేబుల్ ఉద్యోగం రావాలి అంటే మీ వయసు 18 ఏళ్లు దాటాలి. కానీ, నమన్ రాజ్వాడే అనే బుడ్డోడు మాత్రం ఐదేళ్లకే కానిస్టేబుల్ గా నియామక పత్రం కూడా అందుకున్నాడు. జిల్లా ఎస్పీ చేతుల మీదుగా లెటర్ అందుకుని చైల్డ్ కానిస్టేబుల్ అయిపోయాడు.
ప్రస్తుతం ఓ బుడ్డోడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. ఎందుకంటే అతను ఐదేళ్లకే కానిస్టేబుల్ అయిపోయాడు. ఎస్పీ నుంచి అపాయింట్మెంట్ లెటర్ కూడా అందుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం అంతా అతను ఎవరు? ఎందుకు అతడిని ఐదేళ్లకే చైల్డ్ కానిస్టేబుల్ గా నియమించారు అని అనుకుంటున్నారు. అయితే దీని వెనుక ఎలాంటి మర్మం, వింత, శుభవార్తలు ఏమీ లేవు. ఆ చిన్నారి తండ్రి చనిపోయినందు వల్ల అతనికి కారుణ్య నియామకంలో ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. అసలు ఆ చిన్నారి ఎవరు? అతనికి ఎలా ఆ జాబ్ ఇచ్చారో చూద్దాం.
ఆ చిన్నారి పేరు నమన్ రాజ్వాడే. ఛత్తీస్ గఢ్ సుర్గుజా జిల్లాకు చెందిన నమన్ రాజ్వాడే పోలీస్ కానిస్టేబుల్ గా నియమితులయ్యాడు. అతని వయసు కేవంల ఐదేళ్లు మాత్రమే. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ భావనా గుప్తా అనికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అందజేశారు. నమన్ తండ్రి రాజ్ కుమార్ రాజ్వాడే పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించేవాడు. అతను సెప్టెంబర్ 3, 2021లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కారుణ్య నిమాయకం కింద నమన్ కు ఈ ఉద్యోగం దక్కింది. అయితే రూల్స్ ప్రకారం 18 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే పూర్తి అధికారాలు దక్కుతాయి. ప్రస్తుతానికి చైల్డ్ కానిస్టేబుల్ గా నమన్ రాజ్వాడే కొనసాగుతాడు.