ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్న ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దలు ప్రేమ వివాహాలకు అంగీకరించక పోయినా చివరికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒప్పుకునే పరిస్థితులు లేకుంటే మాత్రం ఎంచక్కా.. పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ప్రేమించిన వారిని విడిచి ఉండలేక, మరిచిపోలేక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రేమికులు ఒకే చెట్టుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్ పూర్ ప్రాంతం. ఇక్కడే హర్వీందర్ సింగ్ (22), ప్రతీ (22) అనే ఇద్దరూ నివాసం ఉంటున్నారు. గతంలో వీరికి కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. అలా తరుచు కలిసి మాట్లాడుకుంటు ఉండడంతో చివరికి ఇద్దరూ ప్రేమించుకున్నారు. అలా కొన్నేళ్ల పాటు వీరి ప్రేమాయణం సాగుతూ వచ్చింది. ఇక ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ, ఇరువురి పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ సమయంలోనే ప్రేమికులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ ఉండగానే హర్వీందర్ సింగ్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేశారు. కానీ తల్లిదండ్రులను కాదనలేక హర్వీందర్ సింగ్ ప్రేమించిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
కానీ ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక, చేసుకున్న అమ్మాయితో సంతోషంగా ఉండలేక మధ్యలో నలిగిపోతున్నాడు. ఇక పెళ్లైన కూడా హర్వీందర్ సింగ్ తన ప్రియురాలు ప్రీతితో తరుచు ఫోన్ లో మాట్లాడుతుండేవాడు. అయితే ఇటీవల ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి కనిపించకుండా పోయారు. ఇక కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరిని మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. దీంతో ఈ ప్రేమికులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఇక మరుసటి రోజు మరోసారి ఆ ప్రేమికులు ఇంటి నుంచి బయటకు వెళ్లి సమీపంలో ఉన్న అడవిలో వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లాక ఒకే చెట్టుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది.