భర్త రోజూ అలా చేస్తున్నాడని ఓ భార్య విసిగిపోయింది. అతని టార్చర్ తట్టుకోలేక మొగుడికి పాడె కట్టాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల భర్త హత్యకు కుట్ర పన్ని చివరికి అనుకున్నది చేసింది. అసలేం జరిగిందంటే?
పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. నచ్చిన వారిని పెళ్లి చేసుకుని అతనితో సుఖంగా ఉండాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది. ఇక అలా పెళ్లైన కొన్నాళ్లకే దంపతుల మధ్య గొడవలు మొదలవుతాయి. దీంతో విసిగిపోయి హత్య చేయడమో, ఆత్మహత్య చేసుకోవడమో చేస్తూ చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ మహిళ.. పెళ్లి రోజే కట్టుకున్న భర్తను ప్రాణాలతో లేకుండా చేసింది. ఇటీవల ఛత్తీస్ ఘడ్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్ ఘడ్ లోని కోర్బా పరిధిలోని ఓ ప్రాంతంలో జగ్జీవన్ రామ్ రాత్రే, ధనేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భర్త జగ్జీవన్ రామ్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో అతడు నిత్యం మందు తాగే ఇంటికి వచ్చేవాడు. ఇక మత్తులో జగ్జీవన్ రామ్ రాత్రే తన భార్యతో రోజూ గొడవ పడి భార్యను వేధించేవాడు. ఇక రాను రాను అతని వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ధనేశ్వరీ.. భర్త టార్చర్ ను తట్టుకోలేకపోయింది. ఇక విసిగిపోయిన ఆ మహిళ.. భర్తను ప్రాణాలతో లేకుండా చేయాలని ప్లాన్ గీసింది. ఇందుకోసం గోపి అనే వ్కక్తిని పరిచయం చేసుకుంది. తన పడుతున్న ఇబ్బందులను అన్నీ ధనేశ్వరి గోపికి వివరించి భర్తను హత్య చేయమాని పురి గోల్పింది. దీనికి అతడు కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సుపారీలో భాగంగా అతడికి డబ్బులు ఇవ్వడానికి చేతిలో చిల్ల గవ్వలేదు. ఏం చేయాలో తెలియక తన నగలు అమ్మి మరీ గోపికి రూ. 50 వేలు అడ్వాన్స్ ఇచ్చింది.
మరో విషయం ఏంటంటే? వీరి పెళ్లి రోజే భర్తను హత్య ధనేశ్వరి స్కెచ్ వేసింది. ఇక ధనేశ్వరి అనుకున్నట్లే.. గోపి ఆమె భర్త జగ్జీవన్ రామ్ రాత్రేను ఇటీవల అతి దారుణంగా హత్య చేశాడు. ఇక ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడు వాటిని ఆయుధాలు, దొరికిన రక్తపు మరకల దుస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా ముందుగా మృతుడి భార్య ధనేశ్వరిని విచారించారు. మొదట్లో ఆ మహిళ తనకేం సంబంధం లేదన్నట్లుగా నటిస్తూ.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను గట్టిగా విచారించగా మొత్తానికి తన నేరాన్ని అంగీకరించింది. ఆ తర్వాత పోలీసులు నిందితులైన మృతుడి భార్య ధనేశ్వరితో పాటు గోపిని కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.