ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. ఫుడ్ డెలివరీ సేవలు వినియోదారుడికి మరింత చేరువయ్యేల కొత్త ప్రకట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్డర్ ఇచ్చిన 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అంటూ జోమోటో ప్రకటనలు చేసింది. అయితే ఈ ప్రకటన విషయంలో జోమోటోపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు కన్నెర్ర చేశారు. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లో ఎలా వినియోగదారులకు ఆహారం డెలవరీ చేస్తారో తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ సంస్థకు గురువారం నోటీసులు జారీ చేశారు.
పది నిమిషాల్లో కస్టమర్ కి ఆహారం పదార్థాలు అందిచాల్సి ఉండటంతో, ఆ సంస్థ ఉద్యోగులు తమ వాహనాల్లో అతి వేగంగా దూసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వెళాల్సి వస్తుంది. దీనిని పరిగణలోకి తీసుకున్న చెన్నై ట్రాఫిక్ పోలీసు వర్గాలు జోమోటోకు నోటీసులు జారీ చేశాయి. పది నిమిషాల్లో ఎలా ఫుడ్ సరఫరా చేస్తారో అనే విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు. ఆహార పదార్థాలను జుమోటో అర్డర్ ఇస్తే కొంత సమయంలో ఎక్కడికైనా డెలివరీ చేస్తారు.
ఈ పరిస్థితుల్లో వినియోగదారుడికి మరింత చేరువయ్యే విధంగా ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రకటనను జుమోటో వర్గాలు చేశాయి. దీంతో కేవలం పది నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారు? అనే చాలా మందిలో సందేహం కలిగింది. చెన్నై వంటి నగరాల్లో అయితే, ఇది అసాధ్యమన్న సంకేతాలు కూడా వినిపించాయి. దీంతో 10 నిమిషాల్లో కస్టమర్ కి ఫుడ్ ఎలా డెలవరీ చేస్తారో వివరణ ఇవ్వాలని తాజాగా చెన్నై ట్రాఫిక్ పోలీసులు సదరు సంస్థకు నోటీసులు జారీ చేశారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.