తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ? వాడు గిట్టనేమీ? అనే వేమన పద్యం అందరూ చదువుకునే ఉంటారు. ఇప్పుడు ఈ కోవకు చెందిన పుత్రులే ఎక్కువైపోతున్నారు. తల్లిదండ్రులేమో పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటూ ఆశలు పెట్టుకుని కొడుకు కోసం అందరు దేవుళ్లను మొక్కుతుంటారు. కానీ, ఇలాంటి పుత్రులు మాత్రం బతికుండగానే తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. భర్తపోయి ఒంటరిగా బతుకుతున్న తల్లి బాధ్యత తీసుకోకుండా.. అనాథను చేద్దామనుకున్న పుత్ర రత్నాన్ని పోలీసులు అరెస్టు చేశారు. […]
సినిమాల కన్నా ఎక్కువగా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేం మీరా మీథున్. నోటికొచ్చినట్లు.. మాట్లాడి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అది కాస్త వివాదాస్పదంగా మారడంతో.. ఆమెపై ఎవరో ఒకరు పోలీసులుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరాపై గతంలో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తాజాగా ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులుకు మీరా మీథున్ పోలీసులకు చుక్కలు చూపింపించింది. […]
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. ఫుడ్ డెలివరీ సేవలు వినియోదారుడికి మరింత చేరువయ్యేల కొత్త ప్రకట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్డర్ ఇచ్చిన 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అంటూ జోమోటో ప్రకటనలు చేసింది. అయితే ఈ ప్రకటన విషయంలో జోమోటోపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు కన్నెర్ర చేశారు. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లో ఎలా వినియోగదారులకు ఆహారం డెలవరీ చేస్తారో తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ సంస్థకు గురువారం నోటీసులు జారీ చేశారు. పది […]