సినిమాల కన్నా ఎక్కువగా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేం మీరా మీథున్. నోటికొచ్చినట్లు.. మాట్లాడి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అది కాస్త వివాదాస్పదంగా మారడంతో.. ఆమెపై ఎవరో ఒకరు పోలీసులుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరాపై గతంలో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తాజాగా ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులుకు మీరా మీథున్ పోలీసులకు చుక్కలు చూపింపించింది.
మీరా మీథున్‌ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో ‘ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు టార్చర్ చేస్తున్నారు.. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించండి’ అంటూ అరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేగాక ప్రతి ఒక్కరూ, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ.. ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: బిందు మాధవిపై సీనియర్లు సీరియస్! గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారు?
అరెస్ట్ వారెంట్ ఎందుకంటే..
పలు తమిళ చిత్రాల్లో నటించిన మీరాకు అవకాశాలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, అందులో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది. వారిని వెంటనే ఇండస్ట్రీ నుంచి తప్పించాలంటూ వారిని, వారి కులాన్ని కించపరుస్తూ గతంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. అప్పట్లో ఈ వీడియో వైరల్ కాగా ఆ సామాజిక వర్గం నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్ట్రీ అట్రాసిటీ కేసుతోపాటు పలు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: Bigg Boss OTT: అరియానా పొట్టి డ్రెస్.. ఆడేసుకున్న అషూరెడ్డి
చాలా రోజుల తర్వాత ఈ కేసుపై చెన్నై కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ మీరా ఒక్క విచారణకు కూడా హాజరు కాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేసి ఏప్రిల్ 4న కోర్టులో హాజరు పర్చాల్సిందిగా కోర్టు పోలీసులకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే.. ఇంత రచ్చ చేసింది మీరా. ఆమె వ్యవహార శైలిపై నెటిజనులు మండిపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ -5 ఫైనల్ హోస్ట్ నాగార్జునలో ఈ తేడా గమనించారా..?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి