పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మధురమైన జ్ఞాపకం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని యువత భావిస్తుంది. అంతేకాక మూహుర్తం సమయానికి పెళ్లితంతు పూర్తి చేయాలని పెద్దలు కూడా భావిస్తారు. అలా మూహుర్తం సమయానికి పెళ్లితంతు జరిగితే నవదంపతులు జీవితాంతం హాయిగా ఉంటారని పెద్దల నమ్మకం. అలాంటి సమయంలో కొన్ని కొన్ని ఆంటంకాలు సైతం ఎదురవుతుంటాయి. పెళ్లివారు వస్తున్న బస్సులు ఆగిపోవడం, వధువు వస్తున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో పెళ్లివారు కంగారు పడిపోతారు. తాజాగా అలా కల్యాణ మండపంకి వెళ్లే క్రమంలో ఓ వధువు ట్రాఫిక్ లో చిక్కుపోయింది. మూహుర్త సమయం దగ్గర పడుతుండటంతో వెంటనే స్థానికంగా ఉన్న మెట్రో రైలో ఎక్కి కల్యాణ మండపానికి చేరుకుంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరు నగరంలో ఉంటే ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టేలే ఈ నవ వధువు వీడియో ఉంది. కల్యాణ మండపానికి కారులో బయలుదేరిన వధువు మధ్యలోనే ట్రాఫిక్ లో ఇరుక్కు పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ ట్రాఫిక్ కు భయపడి మధ్యలోనే కారు దిగి.. వధువుతో సహా మెట్రో ఎక్కారు. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండడంతో ముహూర్తం సమయానికి పెళ్లి మండపానికి చేరుకోలేనని భావించిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు మెట్రోలను జర్నీకి సిద్ధమయ్యారు. పెళ్లి కూతురు కూడా చక్కగా మెట్రో ఎక్కేసింది. ఒంటినిండా బంగారం ధరించి రైలెక్కిన పెళ్లి కూతురును చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు వధువు కుటుంబ సభ్యుల సమయస్ఫూర్తిగా ఆలోచించారంటూ నెటిజన్లు ప్రశంసింస్తున్నారు. ‘స్మార్ట్ పెళ్లి’ కూతురు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం ముహూర్తం సమయానికే బయలుదేరడం ఏంటని ఆమెను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H
— Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023