Bombay High Court : బాంబే హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఓ భర్త సంతోషంలో తేలియాడుతుంటే.. అతని భార్య మాత్రం విషాదంలో మునిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహారాష్ట్రకు చెందిన ఓ జంట 1992, ఏప్రిల్ 17న పెళ్లి చేసుకుంది. భర్త తనను వేధిస్తున్నాడంటూ 2015లో భార్య కోర్టుకు ఎక్కింది. వాదోపవాదాలు విన్న కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, ఆ భర్త మరోసారి కోర్టును ఆశ్రయించాడు. తను బతకటానికి ఎలాంటి ఆర్థిక వనరులు కలిగిలేనని, ప్రభుత్వ టీచర్ ఉద్యోగంలో ఉన్న భార్యనుంచి తనకు ప్రతినెలా రూ.15వేలు భరణం ఇప్పించాలని కోరాడు.
తన భార్య చదువుల కోసం తానెంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. తన ఆశయాన్ని సైతం పక్కన పెట్టి ఆమెకోసం పనిచేశానన్నాడు. భార్య విడాకులు తీసుకోవటం కారణంగా తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందన్నాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆస్తులు కూడా ఏవీ లేవని కోర్టుకు తెలిపాడు. టీచర్‌గా పనిచేస్తూ నెలకు 30 వేల రూపాయలు సంపాదిస్తున్న అతడి భార్య, భర్త చెప్పిన విషయాలను తప్పుబట్టింది. భర్త ఓ షాపు నిర్వహిస్తున్నాడని, ఆటో కూడా నడుపుతున్నాడని, వాటిని అద్దెకు ఇచ్చి కూడా సంపాదిస్తున్నాడని చెప్పింది.
అంతేకాదు! తన కూతురి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనకుందని తెలిపింది. ఇద్దరి వాదనలు విన్న కోర్టు భర్తను సమర్థించింది. అతడికి నెలకు 3 వేల రూపాయలు ఇవ్వాలని భార్యను ఆదేశించింది. ఈ నేపథ్యంలో భార్య హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా, వీరి వాదనలు విన్న కోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. సెక్షన్ 25, 1955 యాక్ట్ ప్రకారం భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ప్రతీ నెల రూ 3 వేల రూపాయలు భరణం ఇవ్వాలని, 2017 ఆగస్టు నెల పెండింగ్ భరణాన్ని కలుపుకుని 5వేల రూపాయలు ఆమె జీతంలోంచి కట్ చేయాలని స్కూలు ప్రిన్సిపల్‌ను ఆదేశించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మాస్క్ ధరించాలా? వద్దా? క్లారిటీ ఇచ్చిన డీహెచ్ శ్రీనివాస్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.