ఈ మధ్య కాలంలో సిటీలలో ప్రయాణాల కోసం బైక్ సర్వీసులకు ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. జనం ఎక్కువగా బైక్ సర్వీసుల మీదే ఆధారపడుతున్నారు. ఇవే ఆడవాళ్ల విషయంలో ఇబ్బందిగా మారుతున్నాయి.
సిటీలో ఉండేవారు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నపుడు బస్సుల్ని, ఆటోలను నమ్ముకోవటం ఎప్పుడో మానేశారు. తొందరగా, ఫ్రీగా ప్రయాణించటానికి క్యాబ్‌లు, బైక్ సేవలను ఆశ్రయిస్తున్నారు. క్యాబ్‌ల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి నూటికి 90 శాతం మంది బైక్ సేవలను ఎంచుకుంటున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో మహిళల పట్ల బైక్ సేవలకు సంబంధించిన డ్రైవర్లు తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బైకు మీద వెళుతున్నపుడో లేక వారి నెంబర్ తమ దగ్గర ఉండటంతోనో కొంతమంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ బైక్ సేవకు సంబంధించిన ఓ డ్రైవర్ తన కస్టమర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతూ ఇబ్బంది పెట్టసాగాడు.
దీంతో ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం హస్న్‌పరి అనే ట్విటర్ ఖాతాధారిణి ఓ ప్రముఖ బైక్ సేవను వినియోగించుకుంది. తన అడ్రెస్ చెప్పటం కోసం వాట్సాప్ ద్వారా బైక్ డ్రైవర్‌కు లోకేషన్ పంపింది. తర్వాత అతడితో మాట్లాడింది. బైక్ డ్రైవర్ ఆమెను పికప్ చేసుకుని, డ్రాప్ చేశాడు. సాధారణంగా కథ అంతటితో ఆగిపోవాలి. కానీ, ఓ వికృతమైన కథ అప్పుడే మొదలైంది. తన దగ్గర ఉన్న సదరు అమ్మాయి వాట్సాప్ నెంబర్‌కు ఆ బైక్ డ్రైవర్ మెసేజ్‌లు చేయటం మొదలుపెట్టాడు. అర్థరాత్రి వేళ ఈ మెసేజ్‌లు పెడుతూ ఉన్నాడు. దీంతో ఆ యువతికి కోపం వచ్చింది.
అతడి వాట్సాప్ మెసేజ్‌లను స్క్రీన్ షాట్లు తీసి వాటిని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ బైక్‌లకంటే.. కార్లు, ఆటోలలోనే ఎక్కువ రక్షణ ఉంటుంది’’.. ‘‘ మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా మీరు’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సమస్యపై సదరు బైక్ సర్వీస్ కంపెనీ స్పందించింది. సదరు బైక్ డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. జరిగిన దానికి క్షమాపణలు చెప్పింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
shared my location with a captain at @rapidobikeapp and this is what i get???? FUCK YOUR APP FUCK YOUR MEN FUCK MEN pic.twitter.com/EHLqd7lpt5
— husnpari (@behurababe) March 12, 2023