కాలం కలిసి రాకపోతే ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుందని పెద్దలు అంటుంటారు. ఎంత గొప్ప వారికైనా.. సరైన కాలం కలసి రాకపోతే అవమానాలు, కష్టాలు, బాధలు తప్పవు. ఇలాంటి ఇబ్బందులు సామాన్యుకే కాదు.. సెలబ్రెటీలకు, రాజకీయ నేతలకు సైతం ఉంటాయి.
టైమ్ బ్యాడ్ అయితే.. ఎంత పెద్ద హోదాల ఉన్నా.. ఎంత ఉన్నత కుటుంబానికి చెందినవారైనా కష్టాలు, అవమానాలు తప్పవు అంటారు. నిజమే.. కాలం కలసిరానపుడు ఎంతటి వారైనా ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేతే లాలూ ప్రసాద్ తనయుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కి ఘోర అవమానం జరిగింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్.. వారణాసికి ఓ కార్యక్రమానికి వచ్చారు. వారనాసికి వచ్చిన తేజ్ ప్రతాప్, ఓ హూటల్ లో బస చేశారు. ఆయన బయలకు వెళ్లి సమయంలో హూటల్ నిర్వాహకులు మంత్రి లగేజీ తో పాటు సెక్యూరిటీ సిబ్బంది బ్యాగులను కూడా బయట పడవేశారు. శుక్రవారం రాత్రి హూటల్ కి వచ్చిన మంత్రి తేజ్ ప్రతాప్ తమ లగేజీ రిసెప్షన్ వద్ద ఉండటం చూసి షాక్ అయ్యారు. మంత్రి కి కేటాయించిన గదిని ఆయన లేని సమయంలో తెరిచి ఆయనకు సంబంధించిన వస్తువులను ఇంత నిర్లక్ష్యంగా బయట వదిలివేయడం పై తేజ్ ప్రతాప్ సీరియస్ అయ్యారు.
హూటల్ యాజమాన్యం నిర్వాకంపై మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ సంతోష్ సింగ్ మాట్లాడుతూ.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఏప్రిల్ 6 వ తేదీ గురువారం ఒక్కరోజు మత్రమే గదిని బుక్ చేసుకున్నట్లు హూటల్ యాజమాన్యం తెలిపిందని అన్నారు. శుక్రవారం ఆ గదిని మరొకరికి కేటాయించడం తో బయటకు వెళ్లిన మంత్రి కోసం చాలా సేపు ఎదురు చూసి గదిలో ఉన్ లగేజీ ఖాళీ చేసి రిసెప్షన్ వద్ద చేర్చినట్లు తెలిపారని చెప్పారు. అయితే లగేజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ది అని హూటల్ సిబ్బందికి తెలియని ఆయన అన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Tej Pratap Yadav had to leave a hotel in Varanasi after its staff allegedly removed his belongings from the room where he was staying. His luggage was kept at the reception, case filed.
https://t.co/lLkdqs67rN— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 8, 2023