సాధారణంగా ప్రేమించుకున్నవాళ్లు పెద్దలను ఒప్పించి.. లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంటారు. అదీ కుదరకపోతే.. ఇక మనసు చంపుకుని.. తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటారు. ఇక కొందరు ప్రేమించిన వారిని మర్చిపోలేక.. జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన ఇందుకు పూర్తి విరుద్ధం. చరిత్రలో కూడా ఇంతవరకు ఇలాంటి సంఘటన గురించి ఎక్కడా ప్రస్తావింవచలేదు. దీని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అంతలా విస్తుపోయే సంఘటన ఏంటి అనుకుంటే.. ప్రేమించుకుని.. విడిపోయి.. వేర్వేరు వ్యక్తులను పెళ్లాడి.. ముగ్గురేసి పిల్లలను కని… పదేళ్ల తర్వాత.. తిరిగి కలుసుకుని.. కుటుంబాలను వదిలేసి వచ్చి మరీ వివాహం చేసుకున్నారు ఆ ప్రేమికులు. ఈ వెరైటీ వెడ్డింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Hyderabad Crime: తాళిబొట్టు తెంచి, తీవ్రంగా కొట్టిన భర్త.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
బిహార్ ఖగారియా గ్రామానికి చెందిన సోనీదేవి, టెలోచ్ గ్రామానికి చెందిన సుమిత్ అనే ఇద్దరు యుక్తవయసులో ఉండగా ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించకపోవడంతో.. వేరే వ్యక్తులను వివాహం చేసుకున్నారు. సోనీదేవికి వేరే వ్యక్తితో వివాహం అయ్యి ముగ్గురు సంతానం ఉండగా.. సుమిత్ కూడా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. సోనీదేవి, సుమిత్ ఇద్దరు విడిపోయి.. ఇప్పటికి 10 ఏళ్లు అవుతుంది. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం మాజీ ప్రేమికులు ఇద్దరు మళ్లీ కలిశారు. ఇంకేముంది మరుగున పడిన ప్రేమ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఇద్దరి ఒకరిని ఒకరు మర్చిపోలేదని అర్థం అయ్యింది. అప్పుడంటే.. తల్లిదండ్రులు అంగీకరించలేదు కనుక విడిపోయాం.. ఇప్పుడు వారితో మనకు పని లేదు.. వివాహం చేసుకుందామని డిసైడ్ అయ్యారు.
ఇది కూడా చదవండి: యువతిని వేధించిన పోకిరి.. నడిరోడ్డుపై కర్రతో చితకొట్టింది!
ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. దాని ప్రకారం సోనీదేవి.. తన మెట్టినింట్లో డబ్బు, నగలు తీసుకుని సుమిత్ వద్దకు చేరుకుంది. వీరిద్దరి వ్యవహారం కాస్త.. రెండు కుటుంబాలకు తెలియడంతో.. వారు సోనీదేవి, సుమిత్‌ని తీసుకెళ్లి.. ఊరి పెద్దల మధ్య పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో ఈ మాజీ ప్రేమికులు ఇద్దరు గుడిలో.. గ్రామస్తుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సోనీదేవి నుదుటిన తిలకం దిద్ది.. ఆమెను తన భార్యగా స్వీకరిస్తున్నానని.. సోనీదేవి అంటే తనకు ఇష్టమని చెప్పాడు. ప్రియురాలు కూడా సుమిత్ కోసం చావడానికైనా సిద్ధమని వెల్లడించింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతుండటంతో.. గ్రామస్తులు కూడా వారిని వారించలేకపోయారు. ఆ తర్వాత వారిద్దరు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పక్కన తుపాకీతో మంచంపై పవన్ కళ్యాణ్ కునుకు.. ఫోటో వైరల్
ప్రస్తుతం ఈ వెరైటీ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన జనాలు.. ఇదేం పిచ్చిరా బాబు.. ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా.. మీ దుంపలు తెగ.. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వెరైటీ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.