బెంగళూరు ఎయిర్ పోర్టులో తన టీషర్ట్ విప్పించి తనిఖీలు చేశారంటూ ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో ‘‘ బెంగళూరు ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్స్ సందర్భంగా నా షర్ట్ విప్పమని అన్నారు. కేవలం ఒక పెట్టికోట్‌తో సెక్యూరిటీ చెకింగ్ పాయింట్‌లో నిలబడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి అటెన్షన్ కావాలని మహిళలుగా ఎవ్వరూ ఆశించరు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ మహిళల బట్టలు విప్పించాల్సిన అవసరం ఏముంది?’’ అని ప్రశ్నించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెకు చాలా మంది సపోర్టుగా నిలిచారు.
అంతేకాదు! ఆమెకు జరిగిన దాన్ని ఖండిస్తూ పోస్టులు కూడా పెట్టడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ లోక్ సభ సభ్యుడు పీసీ మోహన్ ఈ ఘటనపై స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలు తప్పుడువని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ బెంగళూరు ఎయిర్‌పోర్టులో తన చొక్కా విప్పించారని ఆ మహిళ చేస్తున్న ఆరోపణలు తప్పుడువి. సెక్యూరిటీ చెకింగ్స్ సమయంలో ఆమె డెనిమ్ జాకెట్ ధరించి ఉంది. దాన్ని విప్పించారు. ఆమెను తనిఖీ చేసింది కూడా మహిళా సిబ్బందే’’ అని పేర్కొన్నారు. క్రిషాని చేసిన ట్వీట్‌ను కూడా ఉంచారు. మహిళ చేసిన దానిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముందని మండిపడుతున్నారు. ‘‘ ఆమె తన ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే అలా ఎందుకు డిలీజ్ చేస్తుంది’’.. ‘‘ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటానికే ఇలాంటి వన్నీ జరుగుతున్నాయి’’.. ‘‘ ఇంత త్వరగా క్లారిఫికేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, బెంగళూరు ఎయిర్ పోర్టులో తన టీషర్ట్ విప్పించి తనిఖీలు చేశారంటూ ఓ మహిళ ఆరోపణలు చేయటం.. అవి తప్పుడు ఆరోపణలు అంటూ లోక్ సభ సభ్యుడు క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Claims of a woman asked to remove her shirt during a security check at the #Bengaluru airport are false.
The woman was wearing a denim jacket with badges and beadings.
She was frisked privately with a female companion present, according to @CISFHQrs sources.@BLRAirport pic.twitter.com/H8n1aPVAQV
— P C Mohan (@PCMohanMP) January 4, 2023