ఇటీవల కాలంలో ట్యాక్సీల, క్యాబ్ ల వినియోగం బాగా పెరిగిపోయింది. బయటకు వెళ్లాలంటే చాలా మంది ట్యాక్సీ వంటి వాహనాలను వాడుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో వీరిపై కొన్ని ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనంగా బెంగళూరులో ఓ ఘటన చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో ట్యాక్సీల, క్యాబ్ ల వినియోగం బాగా పెరిగిపోయింది. బయటకు వెళ్లాలంటే చాలా మంది ట్యాక్సీ వంటి వాహనాలను వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ట్యాక్సీలు, బైక్ లు అందుబాటులో ఉన్నాయి. ఇలా ఈ ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ఆటోలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో వారు ట్యాక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్.. బైక్ ట్యాక్సీ డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాటక రాష్ట్రం బెంగళూరులో ఇందిరానగర్ మెట్రోస్టేషన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ నిల్చోని ఉన్నాడు. అదే సమయంలో ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ కూడా అక్కడి చేరుకున్నాడు. అప్పటికే ఇలాంటి బైక్ ట్యాక్సీలపై సదరు ఆటో డ్రైవర్ కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందిరానగర్ మెట్రోస్టేషన్ ముందు ఆ బైక్ డ్రైవర్ తో ఆటో డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. అతడి తొలుత సాధారణంగా చిన్నగా గొడవ పెట్టుకుని చివరకు అది పెద్దదిగా చేశాడు. అతడి ఫోన్ లాక్కుని ఆవేశంతో నేలపై కొట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సందర్భంగా ఆటో డ్రైవర్ ఆవేశపూరితంగా మాట్లాడాడు.
ఆటో డ్రైవర్ మాట్లాడుతూ..” స్నేహితులారా, అక్రమ ర్యాపిడో వ్యాపారం ఎలా జరుగుతుందో చూడండి. వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చిన ఈ వ్యక్తి ఇక్కడ బైక్ ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఇలాంటి వారి కారణంగా మాకు వ్యాపారం లేకుండా పోతుంది. వేరే దేశానికి చెందిన ఇతడు ఎల్లో కలర్ ట్యాక్సీ నంబర్ ప్లేట్ లేకుండా ఒక యువతిని తీసుకెళ్లడానికి వచ్చాడు” అంటూ ఆటో డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా నెటింట్లో తెగ వైరల్ గా మారింది.
ఈ ఘటనపై బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ వీడియో ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సదరు ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా జరిగిన ఘటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Strict action should be taken against this auto driver under the law.
Is there no such thing as law in Bangalore City?@BlrCityPolice @BlrCityPolice @CPBlr @tv9kannada pic.twitter.com/Uaa4Am9OPV— freedom of speech B,lore (@freedomlore1) March 5, 2023