దేశంలో లైంగిక సంబంధాలు, బాల్య వివాహాల గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఒకవైపు దేశం అభివృద్ధి వైపు సాగుతుంటే.. మరోవైపు ఇలాంటివి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. ఇవి చట్ట రీత్యా నేరమని ప్రభుత్వాలు, అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు అన్నట్లుగా జనాలు పెడచెవిన పెడుతుంటారు. అలాంటి వారికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గట్టి హెచ్చరికలు జారీచేశారు. రాబోవు ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలను అరెస్ట్ చేస్తామని ప్రజల ముందే ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి నోటి నుంచే ఈ ప్రకటన వెలువడడంతో భర్తల్లో భయం పట్టుకుంది.
’14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వివాహమాడటం చట్ట రీత్యా నేరం’. ఈ విషయాలు అందరకి తెలుసు. అయినప్పటికీ అలాంటివి కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో మైనర్ బాలికలను వివాహమాడటం, లైంగిక సంబంధాలు నెరపటంపై హిమంత బిశ్వ శర్మ కన్నెర్ర చేశారు. మహిళలు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు 18 ఏళ్లు అని తెలిపిన ఆయన.. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నప్పటికీ భర్త జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
`Thousands of Husbands Will be Arrested …`: Assam CM Himanta Biswa Sarma on Underage Marriages pic.twitter.com/ITxXZ2HYDA
— Sunder Barange (@sunder_barange) January 28, 2023
మైనర్ బాలికలను వివాహమాడిన భర్తలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అలాంటి భర్తలు జీవిత ఖైదు ఎదుర్కొంటారని వెల్లడించారు. అలాగే, మహిళలు మాతృత్వ అనుభూతిని పొందాల్సిన వయసు 22-30 ఏళ్లని.. కావున పెళ్లి కాని ఆడవాళ్ళు త్వరగా వివాహం చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 కింద చర్యలు తీసుకోనున్నారు. అస్సాం సీఎం తీసుకున్న నిర్ణయం సరైందేనా..? దీంతో బాల్య వివాహాలకు, లైంగిక సంబంధాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Appropriate age for motherhood is 22 to 30 years, says #Assam Chief Minister #HimantaBiswaSarma https://t.co/jhfZOvTcLS
— India Today NE (@IndiaTodayNE) January 28, 2023