గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. శారీరక శ్రమ, అలసట, మానసిక ఒత్తిడి వెరసి గుండెను బలహీనంగా చేస్తున్నాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండని వారు సైతం దీని బారినపడి మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఉన్నఫళంగా కుప్పకూలుతున్నారు. దీనికి సెలబ్రిటీలు అతీతం కాదూ. అందూలోనే 45 ఏళ్ల లోపు నటులు ఉన్నారు.
గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. శారీరక శ్రమ, అలసట, మానసిక ఒత్తిడి వెరసి గుండెను బలహీనంగా చేస్తున్నాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండని వారు సైతం దీని బారినపడి మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఉన్నఫళంగా కుప్పకూలుతున్నారు. దీనికి సెలబ్రిటీలు అతీతం కాదూ. అందూలోనే 45 ఏళ్ల లోపు నటులు ఉన్నారు. ఫిట్‌నెస్‌పై అత్యంత శ్రద్ధ చూపిస్తూ, హెల్తీ ఆహారాన్ని తీసుకుంలూ ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఈ జాబితాలో ఉన్నారు. అందుకే ఉదాహరణ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కుప్పకూలిన సంగతి విదితమే. అలాగే తెలుగు నాట నటుడు తారకరత్న మరణాన్ని కూడా ఎవ్వరూ మర్చిపోలేదు. ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడే పడిపోయిన సంగతి విదితమే. సుమారు 20 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా హార్ట్ ఎటాక్‌తో తుది శ్వాస విడిచారు.
మాజీ మిస్టర్ ఇండియా, ప్రఖ్యాత బాడీ బిల్డర్ ప్రేమ్ రాజ్ అరోరా (42) గుండెపోటుతో మరణించారు. రాజస్తాన్ కోటాలోని నివసిస్తున్న ఆయన..ఎప్పటిలాగానే వర్కౌట్ చేసి ప్రెషప్ అయ్యేందుకు బాత్రూముకు వెళ్లారు. ఎంతకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. తలుపులు బద్దలకొట్టి చూడగా.. షవర్ కింద విగత జీవిగా పడి ఉన్నాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయినట్లు తెలిపారు. ప్రేమ్ రాజ్‌కు ఇద్దరు కుమార్తెలు. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాగ్‌పూర్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో పాటు 2012-13లో రాజస్థాన్ బెస్ట్ పవర్ లిఫ్టింగ్ అవార్డును గెలుచుకున్నారు. 2014లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుపొందారు. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్లలో 2016-17లో రెండు మిస్టర్ ఇండియా టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు.