సమీర్ వాంఖడే.. గత కొన్ని రోజుల నుంచి బలంగా వినిపిస్తున్న పేరు. అయితే షారుఖ్ ఖాన్ కుమార్ అర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ చేసిన వ్యవహారంలో సమీర్ వాంఖడే ప్రముఖ పాత్ర వహించారు. దీంతో ఎన్సీబీ ముంబై జోనల్ అధికారిగా ఉన్న ఆయన పనితీరుపై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే..? అర్యాన్ ఖాన్ విడుదల విషయంలో షారుఖ ఖాన్ కుటుంబం నుంచి రూ. .25 కోట్లు డిమాండ్ చేశాడని ఒక సాక్షి ఆరోపించి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో సమీర్ పై విచారణను కూడా వేగవంతం చేయటమనేది కూడా కాస్త చర్చనీయాంశమవుతోంది.
ఇలాంటి చిన్న డ్రగ్స్ కేసు విషయంలో మహారాష్ట్ర పేరును డ్యామేజ్ చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మండిపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతనిపై డబ్బులు డిమాండ్ చేశాడని వస్తున్న వార్తలపై వాంఖడే స్పందించాడు. ఇదంత నాపై కొందరు కుట్రచేస్తున్నారని, ఈ అంశంపై ఇంత వరకూ షారుఖ్ ఖాన్ కుటుంబం కూడా ఇంతవరకు స్పందించలేదంటూ తెలిపాడు. ఓ రకంగా బాలీవుడ్ సినీ సెలెబ్రెటీల టార్గెట్ చేస్తున్నారన్న వాదనలు కూడా లేకపోలేదు.
అయితే ప్రస్తుతం అర్యాన్ ఖాన్ విడుదలపై వాంఖడే లంచం డిమాండ్ చేశాడన్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్రం స్పందించిందని త్వరలో సమీర్ వాంఖడేను బదిలీ చేయబోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. మరీ బాధ్యత గల ఆఫీసర్ గా ఎంతో ట్రాక్ రికార్డ్ ఉన్న సమీర్ వాంఖడేను నిజంగానే బదిలీ చేస్తారా లేక ఇదంతా అసత్య ప్రచారమా అనేది తెలియాలంటే కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.