బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్.. ఓ బాలీవుడ్ నటితో పార్టీలో కెమెరాకు చిక్కాడు. ఆ నటి ఆర్యన్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మూవీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంత పేరుంటుందో.. వారి పిల్లలకు సైతం అంతే పేరు ఉంటుంది. దాంతో సెలబ్రిటీలతో పాటుగా వారి పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం అభిమానుల్లో ఉంటుంది. అందుకే వారిపై ఓ కన్ను వేసి ఉంచుతారు అభిమానులు. అదీకాక సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో.. వారు ఏం చేసినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువ జంట పార్టీలో కలిసి కనిపించి, అందర్ని ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్.. ఓ బాలీవుడ్ నటితో పార్టీలో కెమెరాకు చిక్కాడు. ఆ నటి ఆర్యన్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కేసుతో ఒక్కసారిగా భారతదేశం మెుత్తం అతడి పేరు మారుమ్రోగిపోయింది. ఆ కేసు నుంచి బయటికి వచ్చిన ఆర్యన్ ఖాన్ కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయితో కలిసి కనిపించి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత సైలెంట్ అయిన ఆర్యన్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ నటి రోషిని వాలియాతో కలిసి ఓ పార్టీ సందడి చేశాడు ఆర్యన్. ఆర్యన్-వాలియా కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రోషిని. ఈ పిక్స్ కు జతగా ఎబౌట్ లాస్ట్ నైట్ అంటూ క్యాప్షన్ ట్యాగ్ చేసింది.
ఇక ఈ ఫోటోల్లో ముద్దుగుమ్మ రోషిని వాలియా యమహాట్ గా ఉంది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీరిద్దరు ఈ పిక్స్ లో హాట్ గా ఉన్నారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల కింద ఓ అమ్మాయితో కనిపించి వార్తల్లో నిలిచిన ఆర్యన్.. తాజాగా మరోసారి అమ్మాయితో కనిపించి వైరల్ గా మారాడు.