సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళ్తే మీడియా వాళ్ళు వెళ్లడం, ఫోటోలు తీసుకోవడం అనేది సహజమే. ఫోటోలు తీసుకోవడం, వారి గురించి ఏదో ఒకటి అడగడం లాంటివి చేస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఓపిగ్గా మీడియా వారికి సమాధానం చెబుతారు. ఫోటోలకు ఫోజులిస్తారు. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా మీడియాకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మామూలే. ప్రాధాన్యత ఇవ్వకపోతే మీడియా వాళ్ళు ఒక రేంజ్ లో ఆడుకుంటారు. యాటిట్యూడ్ చూపిస్తే చాలా దారుణంగా ఆడుకుంటారు. ఇక సోషల్ మీడియా అయితే ఏకిపడేస్తుంది. తాజాగా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో అదే జరుగుతుంది. ఈడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు భయ్యో అని కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్. ఇంకా హీరోగా ఒక్క సినిమా కూడా చేయకుండానే పాపులర్ అయిపోయాడు. ముంబై డ్రగ్స్ కేసుతో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే తాజాగా అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా ‘ఆల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మోహబాత్’ సినిమా స్క్రీనింగ్ ముంబైలో జరిగింది. ఈ స్క్రీనింగ్ కి ఆర్యన్ ఖాన్ హాజరయ్యాడు. అదే సమయంలో మీడియా కూడా అక్కడకు హాజరైంది. మీడియా వాళ్ళు ఆర్యన్ ఖాన్ ను ఫోటోలు కావాలని అడిగితే.. వాళ్ళని పట్టించుకోకుండా వెళిపోయాడు. ఆర్యన్ భాయ్.. ఒక్క ఫోటో భాయ్ అని పిలుస్తున్నా.. ‘ఏ నేను ఇవ్వను పోండి’ అన్నట్టు వెళ్ళిపోయాడు.
కారు ఎక్కి వెళ్తుండగా.. ‘ఆర్యన్ సార్ మీరు మమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు’ అని విలేఖరి అంటే యాటిట్యూడ్ చూపించాడు. కారు ఎక్కి.. కాలు పైకి ఎత్తి.. ‘ఇది నేను’ అన్నట్టు ఒక అరుదైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియా జనం.. ఆర్యన్ ఖాన్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంత యాటిట్యూడ్ పనికిరాదబ్బా.. మీ నాన్నని చూసి నేర్చుకో.. ఆయన పరువు తీయకు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం.. ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఆర్యన్ ఖాన్ ని.. డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు ఇదే మీడియా విసిగించింది కదా.. అలాంటి మీడియాతో ఆర్యన్ ఎందుకు మాట్లాడాలి? అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆర్యన్ ఖాన్ మీడియాని ఇగ్నోర్ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.