నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం నటి రియా చక్రవర్తి అంటూ తీవ్ర ఆరోపణలు వచ్చి ఆ కేసులో రియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ పై ఉన్న రియా కేసులో ఎన్ సీబీ సంచలన నిర్ణయం తీసుకుంది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. సినీ ప్రియులను, సుశాంత్ ఫ్యాన్స్ ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘటన. ఇప్పటికీ అతడి మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. తన పై హత్య జరిగిందని కొందరు.. డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ తన చావుకి కారణం ఏంటన్నది ఎవరికి తెలియదు. అయితే ఇందులో డ్రగ్స్ కోణం ఉండటం పెద్ద దుమారమే లేపింది. సుశాంత్ ప్రేయసి ,నటి అయిన రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. రియాకు మంజూరైన బెయిల్ సవాల్ చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుప్రీంకోర్ట్‌కు తెలిపింది. ఇది ఓ రకంగా అమెకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే అమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్, సైకో ట్రోపిక్ సబ్‌స్టాన్సెన్ చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచి ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు న్యాయముర్తి ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరెష్‌లతో కూడి సుప్రీంకోర్ట్‌కు తెలిపారు.
దివంగత నటుడు సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి డ్రగ్స్ కొనుగోలు చేసి తన ప్రియుడికి ఇచ్చినట్లు ఆరోపిస్తూ నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చార్జిషీట్ దాఖలు చేసింది. అమెతో పాటు మరో 34 మంది పేర్లను ఎన్‌సిబీ చార్జిషీట్‌లో పేర్కొంది. అయితే సుషాంత్‌కి తనే డ్రగ్స్ అలావాటు చేసిందని తను చనిపోవడానికి రియానే కారణం అని ఎన్‌సీబీ చార్జిషీట్‌లో వెల్లడించింది. ఈ కేసులో సుమారు 30రోజుల పాటు జెల్లో గడిపిన రియా బెయిల్‌పై రిలీజ్ అయ్యింది. సుశాంత్ మరణం బాలీవుడ్ జనాలకి తీరని లోటు. బాలీవుడ్‌లో అతి తక్కువ టైంలో ఎక్కువ ఫేం వచ్చిన నటుడు సుశాంత్. తను చేసిన ఎం.ఎస్.ధోని, రాబ్తా, చిచోరే, కేదార్నాథ్ వంటి చిత్రాలు తనకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.