ఈ భూ ప్రపంచం పై ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. కొన్నింటిని జనాలు నమ్ముతుంటారు.. మరికొన్నింటిని మూఢనమ్మకాలుగా తీసి పారేస్తుంటారు. కొన్ని కొన్ని మిస్టరీలను మనం కళ్లతో చూసినా గానీ నమ్మలేం. మీకిప్పుడు చెప్పబోయే వార్తకుడా ఇలాంటిదే. తాజాగా చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఓ ఇంటికి ఈ చంద్రగ్రహణం.. శని గ్రహంలా తయ్యారు అయ్యింది. చంద్రగ్రహం ఏర్పడిన తర్వాతి రోజు నుంచి ఓ ఇంట్లో తరచూ మంటలు వస్తున్నాయి. అది కూడా రాత్రి పూట. గత 8 రోజుల్లో 20 సార్లు ఆ ఇంట్లో రాత్రిపూట మంటలు అంటుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. హాలీవుడ్ హార్రర్ మూవీని తలపించే ఈ మిస్టరీ గురించి ఎవ్వరికీ తెలియడంలేదు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది ఉత్తరాఖండ్.. నైనీతాల్ జిల్లా హల్ద్వానీలోని ఓ ఇల్లు. నవంబర్ 8 వరకు ఆ కుటుంబ సభ్యులు కంటి నిండా నిద్రపోయారు. ఎప్పుడైతే ఆ రోజు చంద్రగ్రహణం, భూకంపం సంభవించాయో అప్పటి నుంచి వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆ రోజు నుంచి కుటుంబం మెుత్తం రాత్రి పూట జాగారం చేస్తున్నారు. చంద్రగ్రహణం ఏర్పడిన తర్వాత వరుసగా 8 రోజుల నుంచి 20 సార్లు ఆ ఇంట్లో రాత్రిపూట మంటలు చెలరేగుతున్నాయి. ఇలా రాత్రి పూటే మంటలు ఎందుకు అంటుకుంటున్నాయో వారికి అంతు చిక్కడం లేదు. మంటలకు కారణం షాట్ సర్క్యూట్ అని అనుమానించిన వారు ఇంటికి విద్యుత్ కనెక్షన్ను సైతం కట్ చేశారు. దాంతో ప్రమాదం తప్పిందని భావించారు.
కానీ ఆ తర్వాత కూడా కరెంట్ బోర్డ్లు, వైర్లు కాలిపోతున్నట్లు వారు తెలిపారు. గత కొన్నిరోజులుగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు కాలిపోయాయని కుటుంబ సభ్యులు ఆవేద వ్యక్తం చేశారు. తాజాగా విద్యుత్ కనెక్షన్ లేకున్నా కూలర్ లో మంటలు చెలరేగాయని వారు పేర్కొన్నారు. దాంతో విద్యుత్ శాఖ సహాయంతో ఇంటికి ఎర్త్ ను ఏర్పాటు చేసుకున్నారు. మంటలు రావడం మాత్రం ఆగడం లేదని వారు వెల్లడించారు. అయితే చంద్రగ్రహణం తర్వాత ఇలా ప్రతీ రోజు రాత్రి పూట మంటలు రావడం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. దాంతో చుట్టుపక్కల వారందరు భయభ్రాంతులకు లోనైతున్నారు. హాలీవుడ్ ను తలపించే ఈ మిస్టరీ గురించిన విషయలు ఇప్పటి వరకైతే తెలియరాలేదు.