మన దేశంలో మహిళలకు రోజురోజుకూ భద్రత కరువవుతోంది. ప్రభుత్వాలు ఈ విషయంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. స్త్రీలపై దాడులు, అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది.
స్త్రీలు అర్ధరాత్రి కూడా రోడ్లపై స్వేచ్ఛగా తిరిగిన రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. స్త్రీ స్వేచ్ఛ, భద్రత ప్రాముఖ్యత గురించి మహాత్ముడు ఎంతో ఆలోచించే ఆ మాట అనుంటారు. కానీ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా మహిళల భద్రతలో మనం వెనుకపడే ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధరాత్రి కాదు కదా.. పగటిపూట కూడా స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. మహిళల హక్కులు కాపాడబడి, వారి స్వేచ్ఛకు భంగం కలగని రోజు కోసం మొత్తం స్త్రీ జాతి ఎదురుచూస్తోంది. పురుషుల్లాగే ఎలాంటి భయం లేకుండా ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనాలని వెయిట్ చూస్తున్నారు.
అలాంటి పరిస్థితుల కల్పన కోసం ప్రభుత్వాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా మహిళల మీద అకృత్యాలు, దాడులు మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఏదో ఒకచోట స్త్రీలపై అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో ఒక బాలిక మీద యువకుడు యాసిడ్ దాడి చేశాడు. దీంతో బాలిక ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే తనను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికపై యాసిడ్ పోసిన నిందితుడు సుమంత్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దుండగుడు బాలికపై ఎందుకు యాసిడ్ దాడికి పాల్పడ్డాడనేది తెలియరాలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.