ఉత్తర ప్రదేశ్‌లో కూడా జరిగింది. హరి ప్యారీ అనే మహిళ అనుకోకుండా కళ్లు తిరిగి రైలు పట్టాలపై పడిపోయింది. స్థానికులు ఆమెను రక్షించేలోపే వేరే గూడ్స్ రైలు పట్టాలపైకి వచ్చింది. కొన్ని బోగీలు ఆమె పడిపోయిన పట్టాల మీదుగా వెళ్లాయి. అయినా ఆమె అదృష్టం బాగుంది కాబట్టి బతికిపోయింది.
నిత్యం మనం ఎన్నో ప్రమాదాలు చూస్తుంటాం. రోడ్డుపై బస్సులు, బైక్ లు, లారీలు ప్రమాదాలకు గురవుతాయి. అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు కూడా జరుగుతాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతారు. మరికొందరైతే తృటిలో పెను ప్రమాదాలు తప్పి ప్రాణాలతో రక్షింపబడతారు. కొంతమంది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుండి కూడా బతికి బయటపడతారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా ఆశ్ఛర్యమేస్తుంది. అలాంటిదే తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కూడా జరిగింది. హరి ప్యారీ అనే మహిళ అనుకోకుండా కళ్లు తిరిగి రైలు పట్టాలపై పడిపోయింది. స్థానికులు ఆమెను రక్షించేలోపే వేరే గూడ్స్ రైలు పట్టాలపైకి వచ్చింది. కొన్ని బోగీలు ఆమె పడిపోయిన పట్టాల మీదుగా వెళ్లాయి. అయినా ఆమె అదృష్టం బాగుంది కాబట్టి బతికిపోయింది. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ కాస్‌గంజ్‌లో బాబుపుర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో హరి ప్యారీ అనే మహిళ మందులు కొనేందుకు రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుంది. ఆ క్రమంలో ఆమెకు అనుకోకుండా కళ్లు తిరిగి కింద పడిపోయింది. దీంతో స్పృహ తప్పింది. పడిపోయిన మహిళను కొందరు స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించారు. కానీ అంతలోపే ఆ ట్రాక్ లైన్‌పైకి గూడ్స్ రైలు వచ్చింది. కొన్ని బోగీలు ఆమె మీదుగా వెళ్లిన తర్వాత ఆమె స్పృహలోంచి తేరుకుంది. అక్కడ స్థానికులు కాళ్లు, చేతులు కదపకుండా అలాగే పడుకోమని చెప్పారు. తర్వాత ట్రైన్ పూర్తిగా వెళ్లపోయిన తర్వాత ఆ మహిళ పట్టాలపైనుండి తప్పుకుంది. మహిళ అదృష్టం బాగుండి స్వల్ప గాయాలతో బటయపడిందని స్థానికులు తెలిపారు.
ఇటీవల జరిగిన ఒడిశాలో జరిగిన ఘోర రైలుప్రమాదం దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. చాలామంది మృతి చెందగా, 11 వందల మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఏదైనా కానీ చాలమంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ సంఘటన మరుకవక ముందే దేశ వ్యాప్తంగా అక్కడక్కడ గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన వార్తలు వింటూనే ఉన్నాం. ఇంటర్ టాకింగ్ సిస్టమ్ లో లోపాలు ఉన్నపుడు, ట్రైన్స్ లో సాంకేతిక లోపాలు తలెత్తినపుడు రైల్వే బోర్డు అధికారులు పూర్త బాధ్యతతో వ్యవహరించినా కూడా అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.