కొంత మంది యువతులు సోషల్ మీడియాలోని యువకులను నమ్మి నట్టెట్ట మునిగిపోతున్నారు. ఫ్రెండ్ రిక్వస్ట్ రాగానే ఆక్సెప్ట్ చేయటం, ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చుకోవటం అనంతరం మోసపోవటం జరుగుతోంది. ఇదే నేటి తరం కొంతమంది అమ్మాయిలు చేసే అతిపెద్ద పొరపాటు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థి అజిత్ త్రివేది అనే యువకుడు ఇన్ స్టా గ్రామ్ లో ట్రెయినీ ఎయిర్ హోస్టెస్ యువతికి రిక్వస్ట్ పెట్టాడు.
దీంతో వెంటనే ఆ యువతి రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోవటం, చాట్ చేసుకోవటం జోరుగా సాగింది. ఇక కొంతకాల వీరి పరిచయం వ్యక్తిగతంగా కలుసుకునే వరకు వెళ్ళింది. దీంతో అజిత్ త్రివేది ఆ యువతిని ఓ చోటకు రావాలని కబురు పంపాడు. ఇక మనోడి నుంచి వార్తను అందుకున్న ఆమె పరుగు తీస్తూ అతనికి దగ్గరకు వెళ్ళింది. ఇక మెల్లగా మాట మాట కలిపి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు. గుట్టుచప్పుడు కాకుండా కూల్ డ్రింక్ ను చేతికిచ్చి తాగమన్నాడు. ఆ యువకుడిని నమ్మిన ఆ యువతీ మొత్తానికి తాగేసింది.
దీంతో ఆ యువకుడు స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిపై విచక్షణ రహితంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగకుండ ఈ అఘాయిత్యాన్ని వీడియో రూపంలో తీసి పలుమార్లు ఆ యువతిపై లైంగిక దాడికి దిగాడు. దీంతో కొంత కాలానికి తేరుకున్న ఆ ట్రెయినీ ఎయిర్ హోస్టెస్ పోలీసులకు సమాచారాన్ని అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.