సాధారణంగా మీరు మీ మ్యారేజ్ యానివర్సరీకి మీ జీవిత భాగస్వామికి ఏ కారో.. బంగ్లానో.. లేదా ఏ డైమండ్ నక్లెస్ నో బహుమతి ఇవ్వాలని అనుకుంటారు. అయితే ఇందులో ఏముంది అందరు ఇచ్చేదే గా అనుకున్నాడో ఏమో! ఇతగాడు. తన భార్యకు వివాహ వార్షికోత్సవ బహుమతిగా దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చాడు. దాంతో ఆమె భర్త ఇచ్చిన గిఫ్ట్ కు ఆశ్చర్యపోయింది. ఈ అరుదైన ఘటనకు రాజస్తాన్ రాష్ట్రం వేదికైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాజస్తాన్ లోని అజ్మీర్ జిల్లాకు చెందిన దంపతులు ధర్మేంద్ర అనీజా-సప్నా అనీజా. ధర్మేంద్ర బ్రెజిల్‌లో టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చేస్తుంటారు. అయితే ‘వచ్చే వెడ్డింగ్ యానివర్సరీకి చంద్రుడి మీద స్థలం కొని నా భార్యకు బహుమతిగా ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయించుకున్నా. కానీ ఇది అంత ఈజీ కాదు అని ధర్మేంద్ర అన్నాడు. అయినప్పటికీ తన ప్రయత్నాలు మానలేదు. చివరికి తాను అనుకున్నది సాధించాడు ధర్మేంద్ర అనీజా.
ఆ రోజు రానే వచ్చింది.. డిసెంబర్24న తమ 8వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ధర్మేంద్ర తాను కొనుగోలు చేసిన పత్రాలను తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు. అవి 17 పేజీలు ఉన్నాయి. ఆమెకు అర్థం కాలేదు. ఏంటివి ఇవి అని అడగ్గా.. అతడు నీ కోసమే చంద్రుడిపై భూమి కొన్నట్లు చెప్పాడు. దాంతో సప్నా అనీజా ఒక్కసారిగా ఆనందం తట్టుకోలేక పోయింది. విషయం తెలిసి కన్నీరు పెట్టుకుంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘బహుశా ఈ ప్రపంచంలో ఈ బహుమతి పొందిన అదృష్టవంతురాలిని నేనే కావచ్చు’ అని అన్నారు.
ధర్మేంద చంద్రుడిపై 14.3 ఉత్తర అక్షాంశం, 5.6 తూర్పు రేఖాంశాలలో 377, 378, 379 నంబర్ల పేరుతో మూడు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. భూమి మీద స్థలం కొనడానికి ఒక పద్దతి ఉన్నట్లే, చంద్రుని మీద కొనడానికి కూడా ఒక విధానం ఉంటుంది. అది కాస్త సుదీర్ఘ ప్రక్రియ అని అన్నారు ధర్మేంద్ర. చంద్రుని మీద భూమిని కొనడానికి ఏడాది కిందటే అమెరికాకు చెందిన ఒక సంస్థ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు ధర్మేంద్ర.
ఆ సంస్థ దరఖాస్తును ఓకే చేసిన తర్వాత ఆయన చాలాసార్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబం, ఆస్తిపాస్తుల వివరాలను సంబంధిత సంస్థ అధికారులు ఆధారాలతోఈ ప్రక్రియకు దాదాపు సంవత్సరం పట్టింది. అయితే ఈ క్రమంలోనే చంద్రునిపై స్థలం అమ్ముతామని చెప్పి అనేక నకిలీ కంపెనీలు నన్ను సంప్రదించాయి.
ఈ నేపథ్యంలో చంద్రునిపై దిగే అధికారం ఉన్న ఏకైక సంస్థ ‘లూనా సొసైటీ ఇంటర్నేషనల్’ మాత్రమే అని తెలిపారు అనీజా. అక్కడ కొనే భూమికి 1 ఏడాది నుంచి 49 ఏళ్ల వరకు యాజమాన్య హక్కులు ఉంటాయని, తాను 49 సంవత్సరాలకు ఓనర్ షిప్ రైట్స్ తీసుకున్నానని ధర్మేంద్ర వివరించారు. అక్కడ కొనుగోలు చేసిన భూమి మీద ఏదైనా పరిశోధన జరిగితే రాయల్టీ అందుతుందని వెల్లడించారు. భార్య కోసం ఇంత విలువైన బహుమతి ఇచ్చిన భర్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.