తెలుగు చిత్ర పరిశ్రమ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా నుంచి కోలుకోని ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఇంతలోనే ప్రొడ్యూసర్స్ గిల్ట్ షూటింగ్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇండస్ట్రీ మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ఇన్ని సమస్యలు ఉన్నా కంటెంట్ బాగుంటే థియేటర్లకు జనాలు ఎగబడి వస్తారని మెగాస్టార్ తాజాగా విడుదలైన రెండు సినిమాల గురించి ట్వీట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. సుమార్ 2ఏళ్ల పాటు ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్స్ లకు వెళ్లాలంటేనే భయపడ్డారు. ఆ తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడ్డప్పటికీ టికెట్ రేట్లు పెరగడంతో ప్రేక్షకులు సినిమా హాల్స్ కు రావడం తగ్గించారు. అదీ కాక సినిమాలు రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. దీంతో జనాలు థియేటర్స్ కు వెళ్ళడానికి అంత ఆసక్తి చూపించడంలేదు. ఇటీవల ఇండస్ట్రీలో కొందరు అంత ఈజీగా ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు. దాంతో చిన్న, మీడియం బడ్జెట్‌తో సినిమాలను నిర్మించే వారిలోనూ ధైర్యం తగ్గుతోంది. అలాంటి వారికి తాజాగా వచ్చిన 'బింబిసార', 'సీతారామం' సినిమాలు ఊరటనిచ్చాయి. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.."ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటను, మరింత ఉత్సాహాన్ని ఇచ్చే వార్త ఇది. కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ సంధర్భంగా 'సీతారామం', 'బింబిసార' చిత్రాల నటీ నటులకు,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు".. అని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇది అన్ని సినిమాల విషయంలో జరగడం లేదు. ఇటీవల విడుదలైన RRR,కేజీఎఫ్2, విక్రమ్, మేజర్, పుష్ఫ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి సీతారామం, బింబిసార చిత్రాలు నిరుపించాయి. మరి ఇలాంటి సమయం లో మెగాస్టార్ చిరంజీవి స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara @VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఇదీ చదవండి: ఖరీదైన కారులో హీరో గోపీచంద్ ఇంటికి ప్రభాస్! కారణం ఏంటంటే? ఇదీ చదవండి: సమంత అంటే నాకు ఇప్పటికీ గౌరవమే: నాగచైతన్య