ఆ రోజు రాత్రి ఆ మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ తిని నిద్రలోకి జారుకున్నారు. ఉదయం 8 గంటలకు ఆమె కుమారుడు నిద్రలేచాడు. ఇక ఎప్పటిలాగే ఆ బాలుడు బయటకు వెళ్లి తన స్నేహితులతో పాటు కలిసి ఆడుకున్నాడు. అలా రెండు రాత్రులు గడిచిపోయింది. ఇక తల్లి చనిపోయిన విషయం తెలియని కుమారుడు ఏం చేశాడో తెలుసా?
ఆ రోజు రాత్రి ఆ మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ తిని నిద్రలోకి జారుకున్నారు. ఇక ఉదయం 8 గంటలకు ఆమె కుమారుడు నిద్రలేచాడు. ఇక ఎప్పటిలాగే ఆ బాలుడు బయటకు వెళ్లి తన స్నేహితులతో పాటు కలిసి ఆడుకున్నాడు. అలా రెండు రాత్రులు గడిచిపోయింది. తల్లి మాత్రం నిద్రలేవలేదు. దీంతో కుమారుడికి ఆ విషయం తెలియక రెండు రాత్రులు అలానే గడిపాడు. అనుమానం వచ్చి స్థానికులు వచ్చి చూడగా.. ఆ మహిళ గత రెండు రోజుల క్రితమే మరణించింది. అసలేం జరిగిందంటే?
అది బెంగుళూరులోని గంగానగర్ ప్రాంతం. ఇక్కడే అన్నమ్మ (40), ఆమె భర్త నివాసం ఉండేవారు. అయితే అనారోగ్య కారణాలతో ఆమె భర్త గతంలోనే మరణించాడు. దీంతో అప్పటి నుంచి అన్నమ్మ తన 11 ఏళ్ల కుమారుడిని చూసుకుంటూ బతికేది. మరో విషయం ఏంటంటే? భర్త చనిపోయిన నాటి నుంచి అన్నమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. అయితే ఈమెకు లోబీపీ, షుగర్ ఉన్న విషయం మాత్రం తెలుసుకోలేదు. అన్నమ్మ అలా తన కుమారుడిని చూసుకుంటూ కొంత కాలం గడిపుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 25న రాత్రి అన్నమ్మ, ఆమె కుమారుడు ఇద్దరూ తిని పడుకున్నారు.
ఉదయం 8 గంటల సమయానికి అన్నమ్మ కుమారుడు నిద్రలేచాడు. ఇక ఎప్పటిలాగే ఆ బాలుడు బయట తన స్నేహితులతో పాటు కలిసి ఆడుకున్నాడు. అలా రోజంతా గడిసిపోయింది. ఇంకా లేవడం లేదని కొడుకు తల్లిని నిద్రలేపే ప్రయత్నం చేశాడు. కానీ, తల్లి మాత్రం లేవడం లేదు. మా అమ్మ నిద్రపోతుందేమోనని ఆ బాలుడు అలాగే తల్లితో పాటు రెండు రాత్రుళ్లు ఆమె పక్కనే నిద్రపోయాడు. ఎందుకో స్థానికులకు అనుమానం వచ్చి చూడగా పడుకుని ఉంది. ఆమెను లేపే ప్రయత్నం చేయగా అస్సలు స్పందించలేదు. చివరికి అన్నమ్మ చనిపోయిందని స్థానికులు తెలుసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అన్నమ్మ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ఆమె బంధువులు అంత్యక్రియలు జరిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.