మనం గుడికి వెళ్లినపుడు కోరికలను దేవుడితో చెప్పుకుంటాం. అవి తీరిన వెంటనే మళ్లీ గుడికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొందరు నిప్పుల మీద నడిచి, కొందరు తలనీలాలు దేవుడికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు శూలాలను నాలుకకు గుచ్చుకుని, కొందరు కాలినడకన కొండపైకి ఎక్కి మొక్కులు తీర్చుకుంటారు.
మనం గుడికి వెళ్లినపుడు కోరికలను దేవుడితో చెప్పుకుంటాం. అవి తీరిన వెంటనే మళ్లీ గుడికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొందరు నిప్పుల మీద నడిచి, కొందరు తలనీలాలు దేవుడికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు శూలాలను నాలుకకు గుచ్చుకుని, కొందరు కాలినడకన కొండపైకి ఎక్కి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఇక్కడ బెంగుళూరుకు చెందిన ఇద్దరు దొంగలు దేవుడిపై అపారమైన భక్తి కలిగి ఉన్నారు. దొంగతనానికి వెళ్లే ప్రతిసారి విజయవంతం అయితే ఇచ్చిన మాట ప్రకారం గుడికి వెళ్లి హుండీలో కానుకను సమర్పించుకుంటారు. గుండు గీయించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఇక్కడి దొంగల సెంటిమెంట్. ఈ విచిత్ర దొంగల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
బెంగుళూరులోని సదాశివనగర్ లో మంజునాథ, యతీశ్ అనే ఇద్దరు దొంగలు ఉన్నారు. వారు తరచు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఈ దొంగలు తాము దొంగతనానికి వెళ్లే ముందు దేవునికి మొక్కి వెళతారు. వెళ్లే ప్రతిసారి పని విజయవంతం అయితే వారు ఇచ్చిన మాట ప్రకారం గుడికి వెళ్లి మొక్కులను చెల్లించుకుంటారు. ఇది అక్కడి విచిత్ర దొంగల పని. అయితే ఆగస్టు 13న గిరినగర పరిధిలో శ్యామల అనే వృద్దురాలి గొలుసు దొంగిలించారు. బంగారు గొలుసుతోపాటు, వాహనం కూడా చోరీ చేశారు. ఆ తర్వాత మలెమహాదేశ్వర స్వామి గుడికి వెళ్లారు. అక్కడ తల నీలాలు దేవుడికి సమర్పించుకున్నారు. హుండీలో కానుకలను కూడా వేశారు.
వృద్ధురాలు గొలుసు దొంగలపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. గుడికి వెళ్లి, మొక్కులు చెల్లించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి పోలీసులు ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చారు. వృద్ధురాలి గొలుసు చోరీ సమయంలో సీసీ కెమరా ఫుజేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. దొంగలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితుల దగ్గర ఉన్న 25 గ్రాముల బంగారం, మూడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.