చాలా మంది వీధిల్లో తిరిగే మూగజీవాలను అసహించుకుంటారు. ముఖ్యంగా కుక్కలను, ఇతర జంతువులపై జాలీ అనేదే చూపించకుండా కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం మూగజీవాలంటే అల్లాడిపోతారు. ఆ మూగజీవాలకు ఆహారం అందించనిదే వారికి ఆరోజు గడవదు. అలానే కొందరు తమ ఇంట్లోది కాకపోయిన ఎక్కడైనా హోటల్స్, వేడుకల్లో మిగిలి పోయిన ఆహారాన్ని సేకరించి వీధుల్లో ఉండే కుక్కలకు, ఇతర జంతువులకు అందిస్తుంటారు. అలానే ఓ యువతి కూడా వీధికుక్కలు ఆహారం అందిస్తుండేది. అయితే ఓ వ్యక్తి నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్ కి ఆ యువతి ఆస్పత్రి పాలైంది. అది కూడా తనకు ఇష్టమైన మూగజీవాలకు ఆహారం అందిస్తూ ప్రమాదంలో చిక్కుకుంది.
చండీగఢ్ లో తేజస్విత (25) అనే యువతికి మూగజీవాలంటే ఎంతో ఇష్టం. తన ఇంటికి సమీపంలో రహదారి పక్కన ఉన్న కుక్కలకు, ఇతర మూగజీవాలకు నిత్యం ఆహారం అందిస్తూ ఉంటుంది. అలా చాలా కాలం నుంచి ఆ ప్రాంతంలోని కుక్కలకి తేజస్విత ఆహారం అందిస్తుంది. అలానే ఇటీవల ఓ రోజు రాత్రి కూడా వీధి కుక్కలకి ఆహారం వేసేందుకు రహదారి వద్దకు వెళ్లింది. ఆ రహదారి పక్కన ఉన్న వీధి కుక్కులకు తేజస్విత ఆహారం అందిస్తూ ఉంది. అదే సమయంలో ఓ కారు పక్క రహదారి నుంచి యూ టర్న్ తీసుకుని వేగంగా వచ్చి.. ఆమెపైకి, శునకంపైకి దూసుకెళింది. ఈ ఘటనలో తేజస్విత కింద పడిపోగా, శునకం రెప్పపాటులో అక్కడి నుంచి పరారైంది. ఆమెకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. తేజస్విత తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఓజస్వి కౌశల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య, కుమార్తె రోజూ మార్కెట్ కు వెళ్లి.. వీధి కుక్కలకు ఆహారం అందిస్తుంటారని ఆయన తెలిపారు. ఆర్కిటెక్చర్ డిగ్రీ చదివిన తేజస్విత.. ప్రస్తుతం సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. యువతిపైకి కారు దూసుకెళ్లిన ఘటన అక్కడి సీసీటీవీ లో రికార్ట్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు డ్రైవింగ్ చేసి.. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అంతేకాక మనం కూడా వీధుల్లోకి వెళ్లినప్పుడు, రహదారులపై ఆగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన తెలియజేస్తోంది. అదృష్టం బాగుండి.. ఆ యువతికి ప్రాణాపాయం తప్పింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.