విషాదం నెలకొంది. చిన్నారులు, తల్లిదండ్రులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం చెందారు. మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ సెలవుల కారణంగా చిన్నారులతో కలిసి పెద్దలు విహార యాత్రకు బయలుదేరారు. 40 మందితో వెళ్తున్న టూరిస్టు పడవ బోల్తా పడింది. దీంతో 21 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మలప్పురం జిల్లా తానూర్ సమీపంలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్ బోట్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో నీటిలో మునిగిపోయింది. 21 మంది చనిపోగా.. ఇందులో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది ప్రయాణికులు పడవ కింద చిక్కున్నారు. రెస్క్యూ టీమ్ కి సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని బోల్తా పడ్డ పడవను ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అత్యవసర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని మలప్పురం జిల్లా కలెక్టర్ ను ఆదేశించగా.. రెస్క్యూ సిబ్బంది వేగంగా స్పందించారు. ముఖ్యమంత్రి తన అధికారిక ప్రోగ్రాములను రద్దు చేసుకున్నారు. ఇవాళ ఉదయం తానూర్ రానున్నారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారని, వారంతా స్కూల్ సెలవుల కారణంగా విహారయాత్రకు వచ్చారని కేరళ క్రీడాశాఖ మంత్రి వి అబ్దురహిమాన్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేరళలోని మాలాపురంలో పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తాం’ అని అన్నారు.
Atleast 21 people dead after a tourist boat capsized in Kerala’s Malappuram district. NDRF on the spot; search still underway for other victims.
(Visuals from overnight rescue operation) pic.twitter.com/v1BQs8Ztx6
— ANI (@ANI) May 8, 2023