Army Jawans : ఓ షాపు వాడు చేసిన పనికి ఆర్మీ జవాన్లు అభాసుపాలయ్యారు. మహిళల్ని లేపుకుపోతున్నారన్న ఆరోపణలతో స్థానికులు వారిని అడ్డగించారు. పోలీసులు సైతం వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి పంపించేశారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బారాముల్లా జిల్లా పట్టాన్‌కు చెందిన ఇద్దరు మహిళలు శ్రీనగర్ వచ్చారు. శనివారం శ్రీనగర్ ఎయిర్‌పోర్టు బయట ఉన్న షాఫులో భోజనం చేసి, అక్కడే విశ్రాంతిగా కూర్చున్నారు. ఇంతలో ఓ ఇద్దరు జవాన్లు విమానంలో ఢిల్లీ వెళ్లటానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విమానానికి ఇంకా టైం ఉందని బయట ఉన్న టీ షాపులో టీ తాగేందుకు వెళ్లారు.
ఇంతలో ఆ షాపు యజమాని ఈ నలుగురిని అడ్డుకున్నాడు. ఇద్దరు జవాన్లు ఆ ఇద్దరు మహిళల్ని లేపుకుపోతున్నారంటూ గొడవ చేయటం మొదలుపెట్టాడు. దీంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. గొడవ పెద్దదయింది. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. ఆ ఆడవాళ్లకు, జవాన్లకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఇద్దరు జవాన్లు సారీ చెప్పి పంపించేశారు. ఇద్దరు మహిళల్ని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.