ఇటీవల ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తులు దర్వనమిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. అతివేగం ఇలాంటి ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.
ఈ మద్య దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యల్లో మృత్యువాత పడటం చూస్తూనే ఉన్నాం. రోడ్డు భద్రతాచర్యలు ఎన్ని తీసుకుంటున్నా డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలు సామాన్యులకే కాదు.. రాజకీయ నేతలు, సెలబ్రెటీలకు తప్పడం లేదు. తాజాగా కేంద్ర మంత్రి కారును ఓ ట్రక్కు ఢీ కొంది. వెంటనే భద్రత సిబ్బంది స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన రామ్‌బన్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు ఓ న్యాయసేవా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత జమ్మూ నుంచి శ్రీనగర్ కి తిరిగి వస్తున్న సమయంలో రామ్ బన్ జిల్లా బనిహాల్ వద్ద జమ్మూ- కాశ్మీర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన కారును ఉదయ్ పూర్ సమీపంలో లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ట్రక్కు బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది వెంటనే కారు లో నుంచి బయటకు తీయడంతో ప్రమాదం తప్పిపోయింది.
జమ్మూ-కాశ్మీర్ జాతీయ రహదారిపై కేంద్ర మంత్రి రిజీజు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఉదయ్ పూర్ వెళ్తున్న ఫుల్ లోడ్ తో ఉన్న ట్రక్కు ఢీ కొట్టింది. మెరుపు వేగంతో భద్రతా సిబ్బంది స్పందించి కారు డోర్లు తెరచి మంత్రిని రక్షంచి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు.. ఈ ప్రమాదానికి గల కారణం ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడమే అని అదనపు డీజీ ముశేశ్ సింగ్ తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి ముందు ఓ వీడియో తీశారు.. అది కాస్త ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
Going from Jammu to Udhampur in Jammu & Kashmir to attend Legal Services Camp. Many beneficiaries of the Central Govt Schemes are attending the function along with Judges and NALSA team. Now, one can enjoy the beautiful road throughout the journey. pic.twitter.com/5yg43aJX1C
— Kiren Rijiju (@KirenRijiju) April 8, 2023