సాధారణంగా కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. కొంతమందికి మట్టి తినడం, సుద్దముక్కలు తినడం అలవాటైతే.. మరికొంత మందికి ఏకంగా ఇనుప ముక్కలు తినే అలావాటు కూడా ఉంటుంది. ఇటీవల దేశంలో పలు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.. ఓ వ్యక్తి కడుపులో ఇనుప మేకులు, నాణాలు లాంటి వస్తువులు చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఇలాంటి ఓ విచిత్ర ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఒక వృద్దుడు కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు.. అతనికి ఎక్స్ రే స్కాన్ చేయగా కడుపులో నాణాలు ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు ఖంగుతిన్నారు.. తర్వాత ఆపరేషన్ చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 187 నాణాలు బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే..
రాయచూర్ జిల్లాకు చెందిన దయమప్ప హరిజన్ (58) గత కొంత మానసికంగా బాధపడుతున్నాడు. అతనికి ఎవరైనా తినమిన నాణేలు చేతికి ఇస్తే వాటిని మింగేయడం మొదలు పెట్టాడు. దీంతో అతని కడపులో నాణేలు పేరుకు పోయాయి. ఈ మద్య తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు అతనికి ఎండోస్కోప్, ఎక్స్ రే స్కాన్ చేశారు. ఇక రిపోర్టు వచ్చిన అందరూ ఒక్కసారే షాక్ తిన్నారు. అతని కడపులో చాలా నాణేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆ వృద్దుడికి ఆపరేషన్ చేసి కడుపులో ఉణ్న 187 నాణేలను బయటకు తీశారు.. అవి దాదాపు 1.5 కిలోల బరువు ఉన్నట్లు డాక్టర్ ఈశ్వర్ కలబురగి తెలిపారు.
ఈ సందర్బంగా డాక్టర్ ఈశ్వర్ కలబురిగి మాట్లాడుతూ.. పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న దయమప్ప ను అతని బంధువులు ఆదివారం హాస్పిటల్ కి తీసుకు వచ్చారని.. వెంటనే అతనికి ఎక్స్ రే స్కాన్ చేశామని.. రిపోర్టు చూసి మొదట ఆశ్చర్యం వేసింది. దయమప్ప కొంతకాలంగా స్కిజోఫ్రెనిక్ డిసార్డర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది.. అతనికి ఎవరైనా నాణేలు ఇస్తే వాటిని మింగేసేవాడని ఈ కారణంతోనే కడుపులో నాణేలు ఉండటం వల్ల దయమప్ప కడుపునొప్పితో బాధపడుతున్నట్టు గుర్తించి విజయవంతంగా ఆపరేషన్ చేసి కడుపులోనుంచి నాణేలు తొలగించామని అన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.