నమ్రతా శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా, మోడల్. హీరోయిన్ గా బాలీవుడ్ సినిమాల్లో నటించారు. తెలుగులో మహేష్ బాబు సరసన వంశీ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగులో నటించిన రెండవ సినిమా అంజి. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకే సినిమాల్లోనూ నటించలేదు. 2005లో మహేష్ ని పెళ్లి చేసుకున్నాక ఆమె పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యారు. పిల్లలు పుట్టాక మహేష్, పిల్లలే తన ప్రపంచంగా జీవిస్తున్నారు. ఈ ఏడాది కుటుంబ సభ్యుల మృతితో మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు నెలకొన్నాయి. మహేష్ సోదరుడు రమేష్, మహేష్ తల్లి ఇందిరా దేవి, గత నెలలో మహేష్ తండ్రి కృష్ణ స్వర్గస్తులయ్యారు. ఈ బాధ నుంచి మహేష్ కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ క్రమంలో మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్.. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా గౌతమ్ విషయంలో భయపడిన సంఘటన గురించి ఆమె చెప్పుకొచ్చారు. గౌతమ్ కడుపులో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితిని చూశామని అన్నారు. గౌతమ్ పుట్టే సమయంలో.. హార్రిఫిక్ ఫేస్ ని చూశామని అన్నారు. మా జీవితాల్లో అతి భయంకరమైన సంఘటన అని అన్నారు. చెకప్ కి వెళ్ళినప్పుడు.. గౌతమ్ విషయంలో డాక్టర్లు చేతులెత్తేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అదృష్టవశాత్తు మహేష్ హైదరాబాద్ లోనే, ఫిల్మ్ సిటీలో ఉన్నారని, ఆ సమయంలో కాల్ చేస్తే హాస్పిటల్ కి వచ్చారని అన్నారు. అప్పుడు వైద్యులు గౌతమ్ బర్త్ విషయంలో ఖచ్చితంగా చెప్పలేము అని మహేష్ కి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రతీ కుటుంబానికి చెప్పడానికి ఒక కథ ఉండాలి. ఇది మా కథ’ అని ఆమె అన్నారు.