న్యూ ఢిల్లీ క్రైం- కొంత మందికి సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతోంది. పాపులాటి కోసం లేదంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు. సోషల్ మీడియాలో వేసే వెధవ వేశాలకు పిల్లను సైతం వాడుకుంటున్నారు కొందరు. ఢిల్లీలో ఓ తల్లి చేస్ని నిర్వాకం ఇప్పుడు అందరిచేత చీదరించుకునేలా చేస్తోంది. ఆఖరికి ఢిల్లీ వుమెన్ కమిషన్ స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన కుమారుడితో అసభ్యకరమైన నృత్యాలు, నటనలు చేస్తూ వీడియోలు చేసింది. ఈ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింసదరు మహిళ ఖాతాకు 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ మహిళ తన కొడుకుతో చేస్తున్న వీడియోలను చూసిన ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ తీవ్ర స్తాయిలో మండిపడింది. ఇలాంటి అశ్లీల డాన్స్ లు, నటనల ద్వారా పిల్లాడికి ఆ తల్లి ఏం నేర్పిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ మహిళపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ లేఖ రాసింది. ఆ మహిళ కుమారుడితో చేసిన అశ్లీల నృత్యాలకు సంబందించి ఇన్‌స్టాగ్రామ్ లో ఉన్న వీడియోల్లో కొన్ని ఫొటోలను ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ షేర్ చేసింది. ఆ మహిళపై వెంటనే కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. పదేళ్ల వయసులో ఆ పిల్లాడికి ఇలాంటివి నేర్పడం వల్ల భవిష్యత్తులో అతను ఎలా మారతాడని ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ లేఖలో ప్రశ్నించింది.
తల్లీ బిడ్డల పవిత్ర బంధాన్ని ఆ తల్లి అవమానించేలా ప్రవర్తించిందని ధ్వజమెత్తింది. చిన్నతనంలోనే ఆడవారిని వస్తువులుగా చూడటం నేర్పిస్తే, భవిష్యత్తులో అతను మరిన్ని అపరాధాలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే ఆ మహిళపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్.
सोशल मीडिया पर अपने नाबालिग बेटे के साथ अश्लील वीडियो बनाकर डालने वाली महिला के खिलाफ दिल्ली महिला आयोग की अध्यक्षा @SwatiJaiHind ने भेजा पुलिस को नोटिस। वायरल वीडियो में बच्चे से मां द्वारा अश्लील एक्टिंग व डांस करवाया जा। pic.twitter.com/GrxeurabwJ
— Delhi Commission for Women – DCW (@DCWDelhi) July 19, 2021