నేషనల్ డెస్క్- ఈ కాలంలో ప్రేమలు, అక్రమ సంబంధాలు చాలా కామన్ అయిపోయాయి. చాలా చోట్ల పెళ్లయ్యాక కూడా వేరే వాళ్లతో ప్రేమలో పడుతున్నారు. అది మగవాళ్లు కావచ్చు, ఆడవాళ్లు కావచ్చు. కానీ కుటుంబ సంప్రదాయాలను గాలికొదిలేసి బరితెగించేస్తున్నారు చాలా మంది. ఇలా పెడదారి పడుతున్న చాలా మందిని చూస్తే ఈ సమాజం ఎటు పోతుంతోదన్న ఆందోళన కలుగుతోంది. ఇదిగో ఇక్కడ పెళ్లైన ఓ వివాహిత, తనకు ప్రియుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టింది.
జష్ పూర్‌కు చెందిన ఓ వివాహిత, పథల్ గావ్‌కు చెందిన ఒక యువకుడితో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఆ యువకుడికి కూడా అప్పటికే పెళ్లైంది. అయినా సరే వీరిద్దరూ తమ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి తన ప్రియుడిని అడిగింది. దీనికి అతను కుదరదని చెప్పేశాడు. ప్రియురాలైన ఆ వివాహిత ఎంత చెప్పినా పెళ్లి మాత్రం చేసుకోవడం కుదరదని చెప్పాడు ప్రియుడు. దీంతో కోపగించుకున్న ఆ వివాహిత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్క ఊరుకు వెళ్లి, పొలిమేరల్లో ఉన్న ఒక చెట్టు ఎక్కి ఉరేసుకోవడానికి ప్రయత్నించింది. దీన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే వరకూ ఆమె ఆత్మహత్యకు పాల్పడకుండా ఏంజరిగిందని ఆరా తీశారు ఉరి వాళ్లు. కాసేపటికి అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడి చెట్టు దిగాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. ఇక చేసేది లేక ఆ వివాహిత ప్రియుడితో మాట్లాడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో అప్పుడు శాంతించింది. ఆమె చెట్టు దిగాక కుటుంబ సభ్యులను పిలిచి వారికి అప్పగించారు. కలికాలం అంటే ఇదే మరి.