కృష్ణంరాజు అధ్యక్షతన సరికొత్త అంశాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సమావేశం కానుంది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. మార్చి 2019లో తాము ఎన్నికయ్యామని, ఈ ఏడాది మార్చితో తమ పదవీ కాలం ముగిసిందని ఆ లేఖలలో పేర్కొన్నారు.మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు జరగలేదని, దీంతో కార్యవర్గం లేకుండానే నడుస్తోందన్నారు.
కాబట్టి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా, ‘మా’లో సీనియర్ సభ్యుడిగా ఉన్నందున మీరే ఆ బాధ్యతలు చేపట్టి తక్షణం ఎన్నికలు చేపట్టాలని ఆ లేఖల్లో విజ్ఞప్తి చేసినట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.కాగా, ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం రేపు సాయంత్రం జరగనుంది. ఈ సమావేశానికి మా అధ్యక్షుడు నరేష్ అధ్యక్షత వహించాల్సి ఉండగా, ఆయనకు బదులుగా కృష్ణంరాజు అధ్యక్షత వహించనున్నట్టు సమాచారం. కృష్ణం రాజుకు అందిన లేఖలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
గత సమావేశంలో అంశాలు ఒకసారి ప్రస్తావించుకుంటే ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమతో పాటు సీవీఎల్ నర్సింహరావు ఉన్నారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ప్రభుత్వం వారిని మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం కూడా ఇవ్వలేక పోతున్నారని ఆయన వాపోయారు . అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు. ‘మా’బిల్డింగ్ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తే, తాను సహకరిస్తానని కూడా అయన చెప్పారు.
సినీ పెద్దలంతా కలిసి వస్తే.. ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని బాలయ్య అన్నారు.తదుపరి సమావేశం లో కృష్ణం రాజు ఆయనకు అందిన లేఖల సారాంశాన్ని అభిప్రాయాలను చర్చించే అవకాశం ఉంది .సమావేశం లోని నిర్ణయం కోసం చిత్ర ప్రముఖులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సమావేశం ఒక మంచి నిర్ణయానికి వేదిక కావాలని ఆశిద్దాం !