సురేఖావాణి కూతురు సుప్రీత లవ్ పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా జీ తెలుగులో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో నిఖిల్ తోడుగా కనిపించింది.
సెలబ్రిటీల లవ్ మేటర్స్ ఎప్పుడూ ఆడియెన్స్ కి ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. కామన్ పీపుల్ ప్రేమకథలు కూడా సెలబ్రిటీల లవ్ స్టోరీస్ కంటే గొప్పగా ఉండొచ్చు. కానీ.. అందరి ఆసక్తి ఎప్పుడూ సెలబ్రిటీలు, వారి పిల్లలపైనే ఉంటుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు నటి సురేఖావాణి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో నటిగా కొనసాగుతున్న సురేఖావాణి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే.. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించినప్పటికీ, సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ట్రెండ్ కి తగ్గట్టుగా తన కూతురు సుప్రీతతో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది.
ఈ క్రమంలో తనకున్న క్రేజ్ తో కూతురిని కూడా సోషల్ మీడియాలో పాపులర్ చేసింది. సుప్రీత ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ.. సోషల్ మీడియా ఫాలోయింగ్ లో తల్లినే మించిపోయింది. పెళ్ళై పిల్లలున్న ఆడవాళ్లను ఎవరైనా అంటీ అనే పిలుస్తుంటారు. కానీ.. ఈ తరంలో ఆడాళ్ళు అలా పిలిస్తే ఒప్పుకోట్లే తెలుసు కదా. ఈ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సుప్రీత.. ఎప్పుడూ తన తల్లితోనే ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటుంది. కానీ.. కొన్ని విషయాలలో మాత్రం ఈ ట్రెండ్ కి తగిన స్పీడ్ తో దూసుకుపోతుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్స్, రీల్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో రచ్చ చేస్తోంది.
ఇదిలా ఉండగా.. సుప్రీత లవ్ పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అదికూడా తనను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబర్ నిఖిల్ విజయసింహతో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నా.. తాజాగా జీ తెలుగులో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో నిఖిల్ తోడుగా కనిపించింది. పైగా ఇద్దరు తమ పరిచయాలతో పాటు తమ జర్నీని కూడా షేర్ స్టేజ్ పై షేర్ చేసుకున్నారు. దీంతో వీడియో చూసినవారంతా సుప్రీత – నిఖిల్ నిజంగా లవ్ లో ఉన్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి లవ్ రూమర్స్ త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరి సుప్రీత-నిఖిల్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.