King Cobra : ఓ నాగు పాము ఆ కుటుంబాన్ని పగబట్టినట్లు ఉంది. తెలియక చేసిన తప్పుకు నరకం చూపిస్తోంది. రోజులు గడుస్తున్నా పాము కాటులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ఇప్పటివరకు 55 రోజుల వ్యవధిలో 15 సార్లు కుటుంబంలోని వారిని పాము కాటు వేసింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ధోర్ణకంబాలకు చెందిన గురవయ్య కుటుంబం అక్కడి ఎస్టీ కాలనీలో నివాసం ఉంటోంది. గురవయ్య, కుమారుడు వెంకటేష్ అతడి భార్య, కుమారుడు జగదీష్ గ్రామానికి చివరగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఓ పూరి గుడిసె వేసుకుని ఉంటున్నారు. ఓ రోజు వెంకటేష్ ఇంటి దగ్గర గడ్డి మొక్కలు కోస్తుండగా కత్తి జారి పొదల్లో పడింది.
ఆ పడ్డం పొదల్లో ఉన్న నాగుపాముపై పడింది. కత్తి పడ్డ తర్వాత పాము అక్కడినుంచి వెళ్లిపోవటంతో వెంకటేష్ పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత రాత్రి నిద్రపోతున్న టైంలో నాగుపాము గురవయ్యను కాటేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లటంతో క్షేమంగా బయటపడ్డాడు. ఆ తర్వాత నెల రోజుల్లో 9 సార్లు పాము కాటేసింది. కుటుంబం మొత్తం ఆసుపత్రుల చుట్టూ తిరగటం మామూలైపోయింది. 55 రోజుల టైంలో 15 సార్లు పాము కాటేసింది. రెండు రోజుల క్రితం పాము కాటుకు గురైన జగదీష్ చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వచ్చాడు. ఆ వెంటనే రాత్రి వేళ పాము మళ్లీ కాటేసింది. వరుస పాము కాట్లతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి చేరుకుంది. చుట్టూ అన్ని ఇళ్లు ఉన్నా తమ ఇంటిపైనే పాము ఎందుకు దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పాములు పగబడతాయా.. నిజమెంత?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.