నేటి సమాజంలో మోసగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మంచితనం అనే ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది. తాజాగా ఓ మహిళ చేసిన అలాంటి పనే అందరిని షాక్ కి గురి చేసింది.
నేటి సమాజంలో మోసగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మంచితనం అనే ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది. ఎంతో మంచితనంగా మెలిగి.. చివరకు అదును చూసి భారీ మొత్తం డబ్బులు, నగలతో ఉడాయిస్తుంటారు. ఇలా మోసం చేసే వారిలో మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువ ఉన్నారు. గతంలో విజయనగరంలో జిల్లాలో ఓ మహిళ లక్షల్లో డబ్బులు వసూలు చేసి… తల్లితో సహా ఆ ప్రాంతం నుంచి ఉడాయించింది. తాజాగా అన్నపూర్ణ అనే ఓ వివాహిత కూడా అదే తరహాలో మోసానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో గంటావూరు కాలనీలో నారాయణ, అన్నపూర్ణ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అన్నపూర్ణ స్థానిక కాలనీ వాసులతో ఎంతో స్నేహంగా ఉండేది. వారితో మాటలు కలుపుతూ చీటీల వ్యాపారం నడిపేది. అలా చీటీలు నడపుతూ కాలనీ వాసుల్లో అన్నపూర్ణ నమ్మకాన్ని పెంచుకుంది. స్థానికుల్లో తనపై ఉన్న నమ్మకాన్ని అన్నపూర్ణ క్యాష్ చేసుకుంది. చీటీలను వేయడంతో పాటు వడ్డీలకు సైతం అప్పులు ఇచ్చేది. ఇలా సాగుతున్న అన్నపూర్ణ .. అందరికి ఒక్కసారి షాక్ ఇచ్చింది. కొన్నాళ్లుగా ఆమె ఇంటికి తాళం వేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు.
దీంతో చీటీలు కట్టిన వారు పోన్ చేయడంతో, తాను ఊరెళ్లానని వారంలో వస్తానంటూ అన్నపూర్ణ చెప్పేది. అలా ఆమె చెప్పడం..బాధితులు నమ్మడం రివాజుగా మారింది. అయితే గత మూడు రోజులగా అన్నపూర్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం రూ.50 లక్షల దాకా అన్నపూర్ణ ఇవాల్సి ఉందని బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. కేసును విచారిస్తున్నారు. మరి.. ఇలా చీటీలు, ఇతర స్కీమ్ లో పేరుతో జరుగుతున్న మోసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.