ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాక ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. కాణిపాక ఆలయం సమీపంలోని గోశాల పక్కన ఉన్న పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలోపాత రథచక్రాలు పూర్తిగా కాలిపోయాయి. కాణిపాక దేవస్థానంలో కొత్త రథం రావడంతో ఈ పాత రథాన్ని కొంతకాలంగా గోశాల పక్కన ఉంచారు. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
ఇది కూడా చదవండి:
19 ఏళ్లకే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన యువతి
ఆలయ అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవస్థానానికి సంబంధించిన వస్తువు పాతదైనా, కొత్తదైనా భద్రతపరచాలే కానీ.. నిర్లక్ష్యంగా వదిలేయడం ఏంటని, అందువలనే దుండగులు ఈ దుశ్చర్యానికి పాల్పడినట్లు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రథ చక్రాలను తగలబెట్టడంపై ఉన్నతాధికారుల విచారణ చేపట్టారు.
గతంలోనూ అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా…కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పుపెట్టారు.
స్వామివారి ఉత్సవాలకు రథాన్ని సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చారిత్రాత్మక రామతీర్థ క్షేత్రంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం నుంచి తలను వేరు చేసిన ఘటన కూడా అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. తరువాత కాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. కానీ.., ఇప్పుడు మళ్ళీ కాణిపాకంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
— bade raja (@baderaja04) January 27, 2022