సోషల్ మీడియా.. ఈరోజుల్లో మనిషి జీవితాన్ని శాసిస్తున్న వేదిక ఇది. అయితే.., దీన్ని కొంత మంది చెడు పనులకు వాడుతూ ప్రజలను అతి సులువుగా మోసం చేయగలుగుతున్నాడు. తాజాగా.. ఇలాంటి ఓ ప్రబుద్దిడు చేసిన పని పోలీసులను సైతం బిత్తరపోయేలా చేసింది. ఎందుకో తెలుసా? ఈ ఒకే ఒక్కడు మొత్తం 300 మంది మహిళలను ట్రాప్ చేశాడు. వీరిలో 200 మంది అమ్మాయిలు.100 మంది ఆంటీలు ఉన్నారు.
సోషల్ మీడియా వేదికగా మహిళలకు వల విసరడం, మాయ మాటలతో వారిని బుట్టలోకి వేసుకోవడం, వారితో శారీరకంగా కలవడం, నగ్నంగా, అర్ధనగ్నంగా ఫొటోలు పెట్టించుకోవడం, తర్వాత, వీటిని అడ్డుపెట్టుకుని వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడం ఇతని పని. నిజానికి ఇలాంటి కేసులు కొత్త కాదు. కానీ.., ఒక్కడే 300 మంది మహిళలని ఎలా ట్రాప్ చేయగలిగాడు అన్నదే ఇప్పుడు పోలీసులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసన్న కుమార్ అలియాస్ ప్రశాంత్‌రెడ్డి , అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీ.. బీటెక్ చదివాడు. ఆ తరువాత చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగతనాలు, ఇళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకి చిక్కి పోయాడు. దీంతో.. తాను చేసే క్రైమ్ స్టైల్ మార్చాడు. ఖాళీగా సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేసే మహిళలను టార్గెట్ గా చేసుకున్నాడు.
రకరకాల పేర్లతో వారికి మెసేజ్ లు పంపండం, ముగ్గులోకి లాగడం అలవాటుగా చేసుకున్నాడు. ఇలానే విజయవాడ, హైదరాబాద్, కడపలో కొంతమంది అమ్మాయిలకు ఎర వేశాడు. ఇలా వీరందరి నుండి అర్ధనగ్న ఫొటోలను సేవ్ చేసుకుని.., తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. వీరు చాలా మంది మహిళలు పరువు కోసం బయపడి అతను అడిగినంత సొమ్ము ముట్టచెప్పారు. కానీ.., మరో రూపంలో ప్రసన్న కుమార్ పాపం పండింది.
కడపకు చెందిన ఓ వ్యక్తి ప్రసన్న కుమార్ చేతిలో మోసపోయాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రసన్న కుమార్ అతని దగ్గర నుండి లక్షలు వసూలు చేసి.., పత్తా లేకుండా పోయాడు. ఆ ఉద్యోగి ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు ప్రసన్న కుమార్ ని అరెస్ట్ చేశారు. కానీ.., విచారణలో అతని ఫోన్ ఓపెన్ చేసిన పోలీసులకి కళ్ళు బైర్లు కామమే పిక్స్ కనిపించాయి. దీంతో.., ఆ దిశగా విచారణ చేయడంతో అసలు నిజాలు బయటకి వచ్చాయి.
ఈ సందర్భంగా నిందితుడు ప్రసన్న కుమార్ వద్ద నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ సునీల్ తెలిపారు. మరి.. చూశారు కదా? ఇకనైనా సోషల్ మీడియా పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే.., 300 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన ప్రసన్న కుమార్ కి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.