అమ్మ, నాన్న.. ప్రపంచంలో వీరిద్దరికి మించిన అండ ఇంకేమైనా ఉంటుందా? అస్సలు ఉండదు. కానీ.., వీరిద్దరూ బతికే ఉన్నా.., ముగ్గురు ఆడపిల్లలు అనాధలుగా పెరగాల్సి వస్తే? అలానే పెరిగి, పెళ్లిళ్లు చేసుకున్న తరువాత.. ఆ అమ్మ తిరిగి వస్తే? ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? లేదు.. జగిత్యాల జిల్లాలో నిజంగా జరిగిన సంఘటన. ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జగిత్యాల జిల్లా.. మెట్ పల్లి మండలం.. జగ్గా సాగర్ అనే గ్రామంలో లక్ష్మీ అనే మహిళ భర్తతో కలసి నివశిస్తూ ఉండేది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. కానీ.., కొన్నాళ్ళకి భర్త కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ బాధలో లక్ష్మీకి మతి చెలించింది. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఆమె కూడా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ముగ్గురు కూతుర్లు, మగతోడు లేదు. అమ్మ కోసం అన్నీ దగ్గరలా వెతికారు. కానీ.., ఫలితం లేకుండా పోయింది.ఇదంతా పదకొండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన.
లక్ష్మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రెండు సంవత్సరాల తరువాత నిజామాబాద్ లో ఓ మహిళ అనాధ శవం దొరికింది. ఆమె అచ్చం లక్ష్మీలా ఉండటంతో కూతుర్లు తల్లికి కర్మ కాండలు కూడా పూర్తి చేశారు. ఇక అమ్మ, నాన్న లేరు అనుకునే.. ఆ ముగ్గురు కూతుర్లు లైఫ్ ని లీడ్ చేస్తూ వచ్చారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. పిల్లలుని కన్నారు. అయితే.. సరిగ్గా 11 సంవత్సరాల తరువాత తమిళనాడు నుండి ఓ స్వచ్చంధ సంస్థ సభ్యలు లక్ష్మీ కూతుర్ల వద్దకి వచ్చారు. మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తరువాత మీ అమ్మ లక్ష్మీ చనిపోలేదు. ఆమె మా దగ్గర బతికే ఉన్నారు అన్న తీపి కబురు చెప్పారు.
లక్ష్మీ ముగ్గురు కూతుర్లు ముందుగా ఈ విషయాన్ని నమ్మలేదు. కానీ.., తల్లి లక్ష్మీ తమ కళ్ళ ముందుకి వచ్చి నిలబడటంతో వారు ఆనందంతో కన్నీరు పెట్టేసుకున్నారు. ఇన్నాళ్లు ఏ తోడు కోసమైతే ఆ ముగ్గురు ఆడబిడ్డలు పరితపించారో.. ఆ అమ్మ తిరిగి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముగ్గురు కూతుర్లు తల్లిని పట్టుకుని బోరున విలపించేశారు. పదకొండేళ్ల తరువాత గ్రామానికి తిరిగి వచ్చిన లక్ష్మీని చూడటానికి గ్రామస్తులు కూడా వీరి ఇంటికి బారులు తీరారు. ఇక లక్ష్మీ కూతుర్ల మాట్లాడుతూ.. తల్లి లేని పిల్లలుగా ఈ సమాజంలో చాలా కష్టాలు పడ్డామని, ఇకపై మాకు ఆ బాధ లేదంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు. చూశారు కదా? ఇది కూతుర్ల ప్రేమ అంటే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.