హెల్త్ డెస్క్- పాలు లేనిదే అస్సలు రోజు గడవదు. ఉదయం లేవగానే గొంతులో టీ లేదా కాఫీ పడితే గాని ఆ రోజు ప్రారంభం కాదు. ఇక భోజనంలో పెరుగు లేకపోతే అస్సలు అన్నం తిన్నట్లే ఉండదు చాలా మందికి. మనం రోజులో ఏదో ఒక రూపంలో పాలను తీసుకుంటూ ఉంటాము. పాలు లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. పాలు మనిషి జీవితంలో అంతగా భాగమైపోయాయి. మరి ఇంతటి ప్రాముఖ్యం కలిగిన పాలు స్వఛ్చమైనవేనా.. మనం రోజువారిగా తీసుకుంటున్న పాలల్లో ఏవీ మంచివి.. ఇలాంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి పాలు.. పచ్చి పాలు అంటే గేదె, అవు నుంచి పితికిన పాలు. ఏమాత్రం పాశ్చరైజ్ చేయనివి. అంటే ఎలాంటి ప్రాసెసింగ్ జరగని పాలు. గేదె నుంచి పితికిన తరువాత పాలు పోసేవాళ్ళ దగ్గర నుండి పచ్చి పాలే కొంటుంంటారు. స్వఛ్చతలో ఎలాంటి కల్తీ లేకపోతే పచ్చి పాలు తీసుకోవడం చాలా మంచిది, ఆరోగ్యదాయకం కూడా.
ప్యాకెట్ పాలు.. ప్రస్తుతం చాలా మంది ప్యాకెట్ పాలనే వాడుతున్నారు. ఈ పాలు ఒక టెంపరేచర్ వద్ద పాశ్చరైజ్ చేస్తారు. ఇందు వల్ల పాలలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ నశిస్తాయి. అయితే, ఇలా చేయడం వల్ల ప్యాథోజెన్స్ నశిస్తాయని గ్యారంటీ లేదని చెబుతారు. కానీ అందరికి అందుబాటులో ఉండేది పాకెట్ పాలే కాబట్టి, చాలా మంది ఈ పాకెట్ పాలనే వాడుతున్నారు.
కార్టన్ మిల్క్.. అంటే మనం టెట్రా ప్యాక్ మిల్క్ అని అంటుంటాం. పాలల్లో కార్టన్ మిల్క్ఇ అన్నింటిలోకీ సేఫ్ అంటారు. ఈ టెట్రా ప్యాక్ యొక్క ప్యాకేజింగ్ అల్ట్రా హై టెంపరేచర్ పద్ధతిలో చేస్తారు. ఈ పద్ధతిలో పాలని చాలా హై టెంపరేచర్ లో కొన్ని సెకన్ల పాటు వేడి చేసి, ఆ తరువాత చల్లబరిచి ప్యాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పాలలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, ప్యాథోజెన్స్ వంటివి నశించిపోతాయి. అందుకే టెట్రా ప్యాక్ పాలు మంచివని చెబుతారు
ఆర్గానిక్ మిల్క్.. ప్రపంచం అంతా ప్రస్తుతం ఆర్గానిక్ ఆహారం వైపు చూస్తోంది. ఈ ఆర్గానిక్ ఆహారంలో ఆర్గానిక్ పాలు కూడా ఉన్నాయి. మార్కెట్ లో పలు కంపెనీలు సప్లై చేసే పాలు హెల్దీ, ఆర్గానిక్ అని చెబుతూ ఉంటారు. అంటే అర్ధం ఏమిటంటే వారు ఆవులకి వేసే దాణా కూడా ఆర్గానిక్ అని. ఎలాంటి పురుగు మందులూ వేయకుండా ఉన్న ఫుడ్‌నే ఆవులకి పెడుతున్నారు కాబట్టి ఆ పాలు కూడా ఆర్గానిక్‌గా ఉంటాయి. అలాగే, ఈ ఆవులకి ఎలాంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వరు. అందుకే ఆర్గానిక్ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని చెప్పవచ్చు
ఇక వీటన్నింటిలో ఏ పాలు మంచివి అని అంటే మాత్రం.. కల్తీ లేని స్వఛ్చమైన పాలు ఏవైనా మంచివే అని చెప్పవచ్చు. అందుబాటులో ఉంటే నేరుగా గేదె లేదా ఆవు నుంచి తీసిన పాలు చాలా మంచివని వేరే చెప్పక్కర్లేదు. ఇక ఇరవై నాలుగు గంటల్లో వాడుకునేలా ఉంటే ప్యాకెట్ పాలు కూడా మంచివే. ఐతే ఎక్కువ కాలం పాలు నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం టెట్రా ప్యాక్ పాలు మంచివి.