యన్టీఆర్.. తెలుగునాట ఈ మూడు అక్షరాలకి ఉండే స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో నిమ్మకూరు అనే ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చి.., ఇండస్ట్రీ ఇలవేల్పు అయ్యారు సీనియర్ యన్టీఆర్. ఆ తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.., తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన యుగపురుషుడు ఆయన. సరే.. అదంతా గతం. ఇప్పుడు ఆయన స్థాపించిన పార్టీ తీవ్ర కష్టాల్లో ఉంది. మరోవైపు టీడీపీ పగ్గాలు ఎవరి చేతిలో అయితే ఉన్నాయో.. వారు జూనియర్ యన్టీఆర్ రాకపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ తాతకి తగ్గ మనవడు అనిపించుకోవడానికి జూనియర్ ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
నిజానికి తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారీ.., ఆయన వయసు తక్కువ. సినిమాల్లో ఆయనకి ఇంకా బోలెడంత ఫ్యూచర్ ఉందన్న కామెంట్స్ వినిపిస్తూ వచ్చాయి. అయితే.., ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే.., పెద్దాయన మనవడు పెద్ద నిర్ణయమే తీసుకోనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. జూనియర్ యన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. అయితే.., ఇప్పుడు ఆ సెట్ అంతా యన్టీఆర్ అభిమాన వర్గాలతో, అభిమాన సంఘాలతో కోలాహలంగా మారిందట.
తారక్ ఎందుకు ఇలా జిల్లాల వారీగా అభిమాన వర్గాలతో మీటింగ్ పెడుతున్నారు అని ఆరా తీస్తే.., ఆయన త్వరలోనే ఓ సంచలన ప్రకటన ఇవ్వడానికి సిద్దమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల నుండి తారక్ అభిమానులు ఆయన్ని మీట్ అయ్యారు. ఇంకా అవుతున్నారు. కొన్ని జిల్లాల నుండి అయితే.., ఫ్యాన్స్ రిపీటెడ్ గా వాచవచ్చి కలుస్తున్నారు. తారక్ వారందరికీ కాదనకుండా అపాయింట్ మెంట్ ఇస్తూనే ఉన్నారట. దీంతో.., యన్టీఆర్ నుండి ఎలాంటి ప్రకటన రాబోతోందా అని రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి.
స్టార్ హీరో అన్నాక, లక్షల్లో అభిమాన వర్గాలు, సంఘాలు ఉంటాయి. ఇలా వాళ్ళతో కలిస్తేనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టా అనే అనుమానం మీకు రావచ్చు? కానీ.., ఇందుకు నెటిజన్స్ కొని ఉదాహరణలు చూపిస్తున్నారు. అప్పట్లో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందు “శంకర్ దాదా జిందాబాద్” సినిమా సెట్ అంతా అభిమానులతో నిత్యం కళకళలాడిపోయింది. ఫ్యాన్స్ అసోసియేషన్స్ తో సుదీర్ఘ చర్చలు జరిపాకే చిరంజీవి పొలిటిల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ముందు కూడా ఇలాంటి మీటింగ్స్ జరిగాయి. దీంతో.., జూనియర్ కూడా అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మరి.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ కామెంట్స్ లో నిజం ఎంత ఉంది? తారక్ తన అభిమానులను ఇంత పెద్ద ఎత్తున కలవడానికి కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తేలనుంది. మరి.., జూనియర్ యన్టీఆర్ కొత్త పార్టీ పెడతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.