అతిగా ఫోన్ ను వినియోగిస్తే అనారోగ్య సమస్యల వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అలానే ఎంతో మంది స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించి.. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఓ యువతి కూడా అతిగా ఫోన్ వాడి.. చివరకు వీల్ ఛైర్ కు పరిమితమైంది.
నేటికాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగి పోయింది. ఫోన్ లేకుండా ఉండే వ్యక్తులు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్ ను వినియోగిస్తున్నారు. ఇందుకు కారణం రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. అయితే ఎక్కువ మంది ఫోన్లను అవసరానికి మించి వాడుతున్నారు. గంటల తరబడి ఫోన్లలో కాలాన్ని గడిపేస్తున్నారు. శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన ఈ స్మార్ట్‌ఫోన్లు మనుషుల ఆరోగ్యాలతో కూడ ఆటలాడుకుంటున్నాయి. తెల్లవారి లేచింది మొదలు తిరిగి రాత్రి పడుకునే వరకు ఫోన్లలోనే మునిగి తేలే వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇలా అతిగా ఫోన్ లు వాడి ఎందరో అనారోగ్యాలను కొని తెచ్చుకున్నారు. తాజాగా ఇంగ్లాడ్ కు చెందిన ఓ యువతి అతిగా ఫోన్ వాడి.. చివరకు వీల్ ఛైర్, మంచానికి పరిమితమైంది. ఫోన్ అతిగా వాడటం వలనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇంగ్లాడ్ కు చెందిన ఫెనెల్లా ఫాక్స్ అనే 29 ఏళ్ల యువతి తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఈమెకు ఫోన్ ఎక్కువగా వాడటం అలవాటు. సోషల్ మీడియాలో అనేక రకాల విషయాలను తెలుసుకునేందుకు ఫోన్ లోనే ఎక్కువగా కాలం గడిపేస్తుంది. అలా రోజులో దాదాపు 14 గంటల ఫోన్ లో మునిగి తేలేది. ఇలా చాలా కాలం జరిగిన తరువాత 2021లో ఆమె అనారోగ్యానికి గురైంది. వైద్యులను సంప్రదించగా వర్టిగో వ్యాధి సోకినట్లు తెలిపారు. చివరకు ఫోన్ అతిగా వాడటం వలన.. ఫెనెల్లా వీల్ ఛైర్, మంచానికి పరిమితమైంది. తాను ఎక్కువగా ఫోన్ ఉపయోగించడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఫెనెల్లా ఫాక్స్ మాట్లాడుతూ..”రోజులో 14 గంటల పాటు ఫోన్ వాడుతుంటంతో నేను తీవ్రమైన వర్టిగో వ్యాధికి గురయ్యాను. ఐఫోన్, ఐఫ్యాడ్ లలో లను ఎక్కువగా ఉపయోగించేదాన్ని. గంటల కొద్ది వీటిల్లో ఎక్కువగా సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తుంటాను. దీంతో కొన్ని రోజుల తరువాత తలనొప్పి, మైకం , కళ్లు తిరగడం లాంటి లక్షణాలు మొదలయ్యాయి. చివరకు సరిగ్గా నడవలేక వీల్ ఛైర్ మంచానికి పరిమితమయ్యాను. దాదాపు ఆరు నెలల పాటు ఆ బాధను అనుభవించాను. ఫోన్ వల్లే ఈ సమస్యలు వచ్చాయని అప్పట్లో నాకు తెలియదు” అని ఆమె పేర్కొన్నారు.
స్మార్ట్‌ఫోన్ ద్వారా నిరంతరాయంగా స్క్రోలింగ్, చాట్, గేమింగ్ చేయటం వల్ల మీ చేతి వేళ్లు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు చెప్తుంటారు. మితమీరిన ఫోన్ వినియోగం కారణంగా బ్యాక్ పెయిన్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం కళ్లపై ఒత్తిడిని తీసుకురావటంతో పాటు ప్రమాదకర తలనొప్పులకు దారితీస్తుంది. వైద్యుల చెప్పిన మాటలకు పత్యక్ష ఉదాహరణ ఫెనెల్లా ఫాక్స్ జీవితమే.. మరి.. ఆ యువతి చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.