జీన్స్ ప్యాంట్స్‌ను ఉతుక్కోకుండా వేసుకోవటం సర్వసాధారణం. కానీ, ఎన్ని సార్లు వేసుకున్నా వారంలో ఓ రెండు మూడు సార్లు వేసుకుంటాం. కానీ, ఓ యువతి మాత్రం 18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్స్‌ను ఉతుక్కోకుండా వాడుతోంది.
అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? అందరికి ఉంటుంది. ఫ్యాషన్ ప్రియులను అలరించేందుకు మార్కెట్ లో అన్ని ఫ్యాషన్ డిజైన్స్ తో కూడిన ఐటమ్స్, నగలు, దుస్తులు వస్తున్నాయి. వాటికి తగ్గట్లుగా అన్ని సమకూర్చుకుని అందంగా తయారవ్వాలని అందిరికి ఉంటుంది. అందుకే ఎప్పటి ట్రెండ్ అప్పుడు ఫాలో అవుతుంటారు. అందులో మన యూత్ గురించి చెప్పక్కర్లేదు. యూత్ ఎక్కువగా ఇష్టపడేవి జీన్స్ ప్యాంట్స్. ఆడ, మగ అన్న తేడా లేదు. అందరూ జీన్స్ ప్యాంట్స్‌ను ధరిస్తున్నారు. అయితే, జీన్స్‌ను కొందరు ఉతక్కుండా రోజులు, వారాలు వేసుకుంటూ ఉంటారు.
కానీ, ఓ మహిళ మాత్రం ఓ అడుగు ముందుకు వేసింది. దాదాపు 18 ఏళ్లుగా ప్యాంట్స్‌ను ఉతక్కుండా ధరిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సాండ్రా విల్లిస్ది ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్ ప్రాంతం. ఆమె 18 సంవత్సరాల క్రితం జీన్స్ ప్యాంట్స్ కొంది. ఎంఎస్ డెనిమ్ జీన్స్ ప్యాంట్లను కొన్నది. వాటిని సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ధరిస్తోంది. అలా సంవత్సరానికి ఒకసారి మాత్రమే వేసుకుంటున్నందుకు వాటిని ఉతకాలనిపించలేదని తెలిపింది. ఈమె సెంటు బాగా వాడడంతో చెమట వాసన కూడా రావడంలేదని చెప్పింది. జీన్స్ ప్యాంట్ చాలా నీట్ గా కొత్తగా ఉందని..
దాన్ని మరో రెండు సంవత్సరాల వరకు ఉతకనని సాండ్ర చెబుతోంది. జీన్స్ ప్యాంట్స్‌ను ఉతక్కుండా 20 సార్లు వేసుకుని రికార్డు సృష్టిస్తానంటోంది. వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. పలువురు నెటిజన్లు జీన్స్ అన్నిసార్లు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. దానికి బదులుగా వాటిని శుభ్రంగా తుడుస్తానని బదులిచ్చింది సాండ్ర. ఇప్పుడైతే వాటిని ఉతకాలనిపించడంలేదని, అలా అనిపించినప్పుడు తప్పకుండా వాష్ చేస్తానని అంటోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.