Woman Rents Her Husband: సాధారణంగా తన భర్తను ఏ మహిళ అయిన కన్నెత్తి చూస్తే ఏ భార్య ఊరుకోదు. ఎందుకంటే తన భర్త తనకే సొంత అనే భావనలో ఉంటుంది. అయితే ఓ భార్య మాత్రమే తన భర్తను ఇతర మహిళలకు అద్దెకు ఇస్తుంది. మీరు వింటున్నది నిజమే. అయితే మనం కాస్త నెగిటీవ్ మైండ్ తో ఆలోచన పక్కన పెట్టి అసలు విషయం తెలుసుకుంటే.. ఆమెపై గౌరవం కలుగుతుంది. ఇంతకీ ఆమె తన భర్తను ఎందుకు అద్దెకు ఇస్తుందనే కదా మీ సందేహం? మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
యూకే లోని బకింగ్ హామ్ షైర్ అనే లారా యంగ్ అనే మహిళ తన భర్త జేమ్స్ తో కలిసి నివాసం ఉంటుంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేమ్స్ చాలా మంచివాడు. లారాకు ఇంటి పనులు చాలా సహయ పడుతుంటాడు. ఇంట్లో ఎలాంటి పనులైనా అవలీలాగా చేసేస్తాడు. వడ్రంగి పని నుంచి ఎలక్ట్రికల్ పనుల వరకు ఏదైనా సరే అతడికి కొట్టిన పిండి. అలాగే ఇంటిని అలంకరించడం నుంచి కార్పేట్ పనుల వరకు ఏదైనా సరే చేస్తాడు. జేమ్స్ కు తోటపని అంటే చాలా ఇష్టం. అయితే అతడి టాలెంట్ చూసిన లారా.. భర్త ద్వారా అదనంపు ఆదాయం అర్జీంచాలని భావించిది. “Rent my handy husband” అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా తన భర్తను ఇతర మహిళలకు అద్దెకు ఇస్తుంది. “మీకు ఇంటి పనిలో సాయం ఉంటాడు. చిన్న పనులను చక్కబెడతాడు. తప్పకుండా నా భర్త తన తీరుతో మెప్పిస్తాడు” అంటూ లారా తన భర్తను ప్రమోట్ చేసుకుంది.
తన వెబ్ సైట్ ను ఫేస్‌బుక్ ఇతరాత్ర సోషల్ మీడియా యాప్స్, స్నేహితుల సహాయంతో గట్టి ప్రచారమే చేసింది. జేమ్స్‌ను అద్దెకు తీసుకొనే మహిళ.. అతడిని ఇంటికి తీసుకెళ్లి పనులు చేయించుకోడానికి 35 పౌండ్లు (మన కరెన్సీలో రూ.3352) చెల్లించాలి. ఆ మొత్తంతో వారు ఎంత పెద్ద పనులైనా చేయించుకోవచ్చు. వికలాంగులకు, 65 ఏళ్లు పైబడిన పెద్దవాళ్లకు మాత్రం తక్కువ ధరలోనే జేమ్స్ తన సేవలు అందిస్తాడు. కొంతమంది మహిళలకు లారా ఐడియా బాగా నచ్చింది. “మీ భర్తను అద్దెకు తీసుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అంటూ ఆమెను ప్రోత్సహించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Employee Salary: ఉద్యోగి ఖాతాలో రూ.40 వేలకు బదులు కోటి రూపాయలు శాలరీగా వేసిన కంపెనీ!